ETV Bharat / business

'నాయకత్వ లోపమే కొవిడ్‌ విజృంభణకు కారణం'

author img

By

Published : May 4, 2021, 8:21 PM IST

నాయకత్వలోపాలు, దూరదృష్టి కొరవడటం, తొందరగా సంతృప్తిపడే లక్షణాలే దేశంలో రెండో దశ కొవిడ్ ఉద్ధృతికి కారణమయ్యాయని ఆర్​బీఐ మాజీ గవర్నర్‌, ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్‌బెర్గ్‌తో ముఖాముఖీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మనం జాగ్రత్తగా వ్యవహరిస్తే కొవిడ్ ఈ స్థాయిలో విజృంభించేది కాదన్నారు.

raghuram, covid19 crisis
'భారత్​లో నాయకత్వ లోపమే కొవిడ్‌ విజృంభణకు కారణం'

భారత్‌లో నాయకత్వలేమి, ముందు చూపు కొరత, తొందరగా సంతృప్తి పడే లక్షణాలకు పెరిగిపోతున్న కొవిడ్‌ కేసులే ఉదాహరణగా నిలిచాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌, ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఒక వేళ మనం అప్రమత్తంగా ఉంటే.. జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఇప్పుడు ఇలా జరిగేది కాదని గ్రహించాలి. ప్రపంచంలో మిగిలిన చోట్ల ఏం జరిగిందా అని ఎవరైనా దృష్టి పెడితే తెలిసేది. బ్రెజిల్‌నే ఉదాహరణకు తీసుకొంటే.. అక్కడ వైరస్‌ రెట్టింపు వ్యాప్తి శక్తితో వెనక్కువచ్చిందని గుర్తించేవాళ్లం. గతంలో మనం వైరస్‌ను జయించామని భావించాము. వైరస్‌ తట్టుకొనే శక్తి వచ్చిందని భ్రమించి మళ్లీ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తెరిచాము. ఆ రకంగా భ్రమించడమే ఇప్పుడు ముప్పుగా మారింది' అని వ్యాఖ్యానించారు. తొలి తరంగాన్ని జయించినప్పుడు తగినంత సమయం లభించిందని ఎవరూ భావించకపోవడం టీకాలను అందుబాటులోకి తెచ్చే అంశం కూడా ఆలస్యమైందని రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు.

ఇక ఆర్‌బీఐపై రాజన్‌ మాట్లాడుతూ..'వీలైనంతగా అకామిడేటీవ్ వ్యూహాన్ని అవలంబించాలి. అది ఒత్తిడిలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థపై సందేహాలు తలెత్తుతున్నా.. విదేశీ ఇన్వెస్టర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్‌బీఐ వద్ద భారీ విదేశీమారకద్రవ్య నిల్వలు ఉన్నాయి' అని తెలిపారు.

ఇదీ చూడండి: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అవసరం: పరిశ్రమ సంఘాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.