ETV Bharat / business

ఆర్బిట్రేషన్​ తీర్పుపై భారత్​ సవాల్​ - అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం

భారత్​కు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రెట్రోస్పెక్టివ్ కేసులో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్​కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. సంస్థ నుంచి బాకీల వసూలు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును తాజాగా భారత ప్రభుత్వం సవాల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ​

India-Challenges-Vodafone-Arbitration-Ruling, india vs vodafone
ఆర్బిట్రేషన్​ తీర్పుపై భారత్​ సవాల్​
author img

By

Published : Dec 24, 2020, 12:54 PM IST

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ చెల్లించాల్సిన రూ. 20వేల కోట్ల రెట్రోస్పెక్టివ్ పన్నుకేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్ కోర్టు‌) ఇచ్చిన తీర్పును భారత్‌ సవాల్‌ చేసినట్లు సమాచారం. ఆర్బిట్రేషన్‌ తీర్పును సవాల్‌ చేసేందుకు ఉన్న 90 రోజుల గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో నేడు అప్పీల్‌ దాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

భారత్​కు ఎదురుదెబ్బ

రూ. 22,120కోట్ల రెట్రోస్పెక్టివ్‌(వెనుకటి తేదీ నుంచి విధించిన) పన్ను వివాదంలో బ్రిటిష్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ గ్రూప్‌ పీఎల్‌సీకి అనుకూలంగా ఈ ఏడాది సెప్టెంబరులో ఆర్బిట్రేషన్‌ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. భారత ఆదాయపన్నుశాఖ పారదర్శకత, సమానత్వంగా వ్యవహరించడంలో విఫలమైందన్న న్యాయస్థానం.. వొడాఫోన్‌పై పన్ను విధించడం సరికాదని పేర్కొంది. వొడాఫోన్‌ నుంచి బాకీల వసూలను తక్షణమే నిలిపివేయాలని, అంతేకాకుండా కోర్టు ఖర్చుల కింద రూ.40కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును తాజాగా భారత ప్రభుత్వం సవాల్‌ చేసినట్లు తెలిసింది.

బకాయిలు @ 20వేల కోట్లు

భారత్‌లో టెలికాం సేవలు అందిస్తున్న హచిసన్‌ ఈక్విటీలో 67శాతం వాటాను వొడాఫోన్‌ 2007లో 1,100కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. దీనికి టీడీఎస్‌ కింద రూ. 12,000కోట్లు చెల్లించాలని ఆదాయపన్ను శాఖ గతంలో నోటీసులు జారీ చేసింది. అయితే వొడాఫోన్‌ ఈ మొత్తం చెల్లించకపోవడంతో జరిమానా, వడ్డీలతో కలిపి బకాయిలు రూ.20వేల కోట్లు దాటాయి. ఐటీశాఖ డిమాండ్‌ను 2012 జనవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాత తేదీలతో వర్తించేలా చట్టాన్ని సవరించి మళ్లీ వొడాఫోన్‌ గ్రూప్‌నకు పన్ను నోటీసులు జారీచేసింది. దీంతో కంపెనీ 2014లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఈ ఏడాది వొడాఫోన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.