ADB Loan To India: భారత్లోని 13 రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్యరంగానికి పెద్దపీట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, ఆసియా డెవెలప్మెంట్ బ్యాంక్ నుంచి సుమారు 300 బిలియన్ డాలర్లు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 13 రాష్ట్రాల్లోని వివిధ పట్టణ ప్రాంతాల్లోని 51 లక్షల మురికివాడల్లో నివసించే సుమారు 2 కోట్ల 56 లక్ష మంది లబ్ధిపొందనున్నారు. ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి రజాత్ కుమార్ మిశ్రా భారత్ నుంచి, ఏడీబీ నుంచి టాకియో కొనిషిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ రుణం పట్టణ ప్రాంతాల్లో ఉండే జనాభాకు మెరుగైన వైద్యసేవలను అందించడానికి ఉపయోగపడుతుందని మిశ్రా అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్ యోజన, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లాంటి కార్యక్రమాలకు ఈ మొత్తం దన్నుగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Star Health IPO: స్టార్హెల్త్ ఐపీఓ తేదీ ఖరారు- వివరాలివే..