మీరు ఐటీఆర్ దాఖలు చేశారా? రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
సాధారణంగా ఆదాయ పన్ను రిటర్న్ వెరిఫికేషన్ పూర్తయ్యాక రిఫండ్ ప్రక్రియ మొదలవుతుంది. గతంలోలా ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు చెక్కులు జారీచేయడం లేదు. మీకు రావల్సిన రిఫండ్ నేరుగా మీరు సూచించిన బ్యాంకు ఖాతాలో జమవుతుంది. అయితే... ఇందుకోసం మీ బ్యాంకు ఖాతాను పాన్‌కార్డుకు లింక్ చేయడం తప్పనిసరి. మరి రిఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా అంటారా?
మీరు రిఫండ్ స్టేటస్ సులభంగా తెలుసుకోగలరు. ఇందుకోసం ఈ విధంగా చేయండి.
1. ముందుగా https://www.incometaxindiaefiling.gov.in వెబ్సైట్లో మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
2. వ్యూ రిటర్న్స్ అండ్ ఫామ్స్ పై క్లిక్ చేయండి.
3. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఆప్షన్ క్లిక్ చేయండి.
4. మీ రిటర్న్స్‌కు సంబంధించిన ఆర్థిక సంవత్సరాన్ని సెలెక్ట్ చేయండి.
మీ రిఫండ్ మీ బ్యాంకు ఖాతాలోకి జమ అయినట్లైతే 'రిఫండ్ పెయిడ్' అని చూపిస్తుంది. ఇలా చూపించాక కూడా మీ ఖాతాలో డబ్బు జమకాకపోతే మీ బ్యాంకును లేదా రిఫండ్ క్లెయిమ్ ప్రోసెస్ చేసే ఎస్బీఐని సంప్రదించవచ్చు. ఆదాయ పన్ను శాఖ వారికీ ఫిర్యాదు చేయవచ్చు. ఒక వేళ ఇంకా ప్రాసెసింగ్‌లో ఉన్నట్లయితే స్టేటస్ 'ఈ- వెరిఫైడ్' అని మాత్రమే చూపిస్తుంది.
మరో మార్గమూ ఉంది
రిఫండ్ స్టేటస్ తెలుసుకోవడానికి మరో మార్గమూ ఉంది. ఈ కింది లింక్ క్లిక్ చేసి, మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆర్థిక సంవత్సరం ఎంచుకోండి.
https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రిఫండ్పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా రిఫండ్... బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు బడ్జెట్ సందర్భంగా చెప్పారు.
ఇదీ చూడండి: జియో గిగాఫైబర్ 'ఫిషింగ్ మెయిల్స్'తో జరభద్రం!