ETV Bharat / business

సాంకేతికం: ఐఫోన్‌11 వచ్చేసిందోచ్.. ధరెంతంటే..! - wonderfull features

ప్రముఖ ఐఫోన్ సంస్థ.. టెక్నాలజీలో వినూత్న ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో నూతన శ్రేణి ఐఫోన్11, ఐఫోన్ 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్​లను ఆవిష్కరించింది. అంతేకాదు స్మార్ట్​గా ఉండేలా 5వ తరం యాపిల్​ వాచ్​లను మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది. మరి వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా?

ఐఫోన్‌11 వచ్చేసిందోచ్
author img

By

Published : Sep 11, 2019, 7:14 AM IST

Updated : Sep 30, 2019, 4:49 AM IST

సాంకేతికం: ఐఫోన్‌11 వచ్చేసిందోచ్.. ధరెంతంటే..!

ఐఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం వచ్చేసింది. గతేడాది ఐఫోన్‌ టెన్‌ శ్రేణి ఫోన్లతో ఆకర్షించిన యాపిల్‌ సంస్థ... ఇప్పుడు ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌లను ఆవిష్కరించింది. మంగళవారం ఇక్కడి తమ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని స్టీవ్‌జాబ్స్‌ థియేటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించింది.

అత్యంత శక్తిమంతమైన ఏ13 బయోనిక్‌ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఈ ఫోన్‌ల ప్రత్యేకతగా సంస్థ ప్రకటించింది. ఇదేవిధంగా సిరీస్‌ 5 యాపిల్‌ వాచ్‌ను, 7వ తరం ఐప్యాడ్‌నూ సంస్థ విడుదల చేసింది. ఈనెల 13 నుంచి ఈ ఫోన్ల కోసం బుకింగ్‌ చేసుకోవచ్చని, ఈనెల 20 నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని ప్రకటించింది.

ఇవీ ఆవిష్కరణలు

యాపిల్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి టిమ్‌ కుక్‌ తొలుత యాపిల్‌ టీవీ ప్లస్‌ సేవలను ఆవిష్కరించారు. నవంబరు 1 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. నెలకు కుటుంబ చందా 4.99 డాలర్లుగా ప్రకటించారు. గేమింగ్‌ ప్రియుల కోసం ఆర్కేడ్‌ను కూడా నెలకు 4.99 డాలర్లకు ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు.

* 10.2 అంగుళాల 7వ తరం ఐప్యాడ్‌ను, ఐప్యాడ్‌ ఓఎస్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం కంటే రెండు రెట్ల అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 10 గంటల పాటు పనిచేస్తుంది. ఈనెల 30 నుంచి లభించే ఈ ఐప్యాడ్‌ ధర 329 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.

5వ తరం యాపిల్‌ వాచ్‌

రోజువారీ ఎంతసేపు వ్యాయామం చేశారు, ఎంత శక్తిని వినియోగించారు, హృదయ స్పందన ఎలా ఉంది, శబ్ద - మహిళల ఆరోగ్య అధ్యయనం వంటివి తెలుసుకోవచ్చు. కాంపాస్‌గా ఉపయోగపడుతుంది. అత్యవసర అంతర్జాతీయ సేవలూ లభిస్తాయి. ఒకసారి ఛార్జిచేస్తే బ్యాటరీ రోజంతా వస్తుంది. 100 శాతం రీసైక్లింగ్‌ అల్యూమినియం, ఆర్సెనిక్‌ రహిత గ్లాస్‌ వంటివి వినియోగించి తయారు చేశారు.

వీటి ధర 399, 499 డాలర్లు. ఈనెల 20 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.

* సిరీస్‌ 3 వాచ్‌ల ధరలు 199 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.

సరికొత్త ఐఫోన్లు

ఐఫోన్‌ టెన్‌ సిరీస్‌కు 99 శాతం వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేశారని టిమ్‌కుక్‌ తెలిపారు. టెన్‌ఆర్‌ మోడల్‌ను మరింత మెరుగుపరిచి ఆవిష్కరించిన ఐఫోన్‌ 11 ధర 699 డాలర్ల వద్ద ప్రారంభమవుతుంది. డాలర్‌ విలువ రూ.71గా అనుకుంటే, మన రూపాయల్లో 49,629 అవుతుంది. దేశీయంగా సుంకాలకు తోడు, ఎంత ధర నిర్ణయిస్తారో సంస్థ ఇంకా వెల్లడించలేదు. తక్కువ, మధ్యస్థాయి వెలుగులోనూ అత్యంత స్పష్టంగా చిత్రాలు తీయగలిగే మెషీన్‌లెర్నింగ్‌ సాంకేతికతను ఐఫోన్‌ 11 ప్రో, 11 ప్రోమ్యాక్స్‌లలో అమర్చినట్లు సంస్థ తెలిపింది.

ప్రత్యేకతలివీ

  • ఐఫోన్‌ 11: 6.1 అంగుళాల లిక్విడ్‌ రెటీనా తెర కలిగి బ్లాక్‌, గ్రీన్‌, ఎల్లో, పర్పుల్‌, వైట్‌, రెడ్‌ రంగుల్లో లభ్యం.
  • వెనుకవైపు 2 కెమేరాలు (12 ఎంపీ వైడ్‌- అల్ట్రా వైడ్‌, 4కే స్పష్టత, సినిమాటిక్‌ వీడియో, ఇప్పటివరకు ఐఫోన్‌లో లేని అత్యధిక స్పష్టమైన వీడియోలు తీయొచ్చు, నైట్‌ మోడ్‌) డాల్బీ అట్మోస్‌ శబ్దం.
  • స్లో మోషన్‌ సెల్ఫీస్‌ (స్లోఫీస్‌).
  • మరే ఇతర స్మార్ట్‌ఫోన్‌లో లేని, అత్యధిక వేగంతో పనిచేసే ఏ 13 బయోనిక్‌ సీపీయూ, అత్యంత వేగంతో పనిచేసే జీపీయూ, ఐఫోన్‌ టెన్‌ఆర్‌ కంటే మరో గంట అదనంగా పనిచేసే బ్యాటరీ.
  • శరవేగంతో ముఖాన్ని గుర్తించే కెమేరా.

ఐఫోన్‌ 11 ప్రో

5.8 అంగుళాల సూపర్‌ రెటీనా అత్యంత దృఢమైన తెర కలిగి, మిడ్‌నైట్‌ గ్రీన్‌, స్పేస్‌గ్రే, సిల్వర్‌/వైట్‌, గోల్డ్‌ రంగుల్లో లభ్యం. వెనుకవైపు సింగిల్‌పీస్‌ గ్లాస్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌. వెనుకవైపు 3 కెమేరాలు. డాల్బీ అట్మోస్‌ శబ్దం, సెకనుకు లక్ష కోట్ల ఆపరేషన్లు జరిపే సీపీయూ, 40 శాతం తక్కువ విద్యుత్తు వినియోగం, ఐఫోన్‌ టెన్‌ఎస్‌ కంటే 4 గంటల అదనంగా బ్యాటరీ.

ఐఫోన్‌ 11ప్రో మ్యాక్స్‌

6.5 అంగుళాల తెర. ఐఫోన్‌ టెన్‌ఎస్‌ మ్యాక్స్‌ కంటే 5 గంటలు అదనంగా వచ్చే బ్యాటరీ, వెనుక వైపు 3 కెమేరాలతో (12 వైడ్‌-అల్ట్రావైడ్‌, టెలిఫోటో) ఒకే సమయంలో 3 భిన్న రకాలుగా ఒకే ఫొటో తీయొచ్చు. కను రెప్పల మధ్య చోటును కూడా స్పష్టంగా చూపే సామర్థ్యం దీని సొంతం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ERT POOL -  AP CLIENTS ONLY
Athens – 10 September 2019
1. Greek Prime Minister Kyriakos Mitsotakis and Cypriot President Nicos Anastasiades shake hands and enter Mitsotakis' office
2. Various of meeting
3. SOUNDBITE (Greek) Kyriakos Mitsotakis, Greek Prime Minister:
"I understand that the other side's obstacles concerning the resumption of negotiations do not lead to progress, despite your extremely constructive attitude. While, at the same time,Turkey's illegal behaviour off the Republic of Cyprus continues to provoke. Accompanied by a confrontational rhetoric, this also demonstrates its international isolation."
4. Wide of meeting
5. SOUNDBITE (Greek) Nicos Anastasiades, Cypriot President:
"We have taken steps, we have created the conditions for the terms of reference to be agreed upon. Unfortunately, what followed, as confirmed by yesterday's statements by (Turkish Foreign Minister Mevlut) Cavusoglu, creates concerns regarding Ankara's intentions, but also on the prospect of finally restarting a meaningful, creative dialogue that would lead to the desired solution."
6. Zoom out of meeting
STORYLINE:
Greece's prime minister said Tuesday that Turkey "continues to provoke" in its approach towards the ethnically divided island nation of Cyprus and that Ankara was becoming isolated internationally.
Kyriakos Mitsotakis made the comments during a meeting with visiting Cypriot President Nicos Anastasiades, the first foreign head of state to visit Athens since Mitsotakis won July elections.
Anastasiades' visit came a day after efforts to restart negotiations to reunify the island hit a snag, when Turkish Foreign Minister Mevlut Cavusoglu said Greek Cypriots had to agree Turkish Cypriots would have decision-making parity in governing the country before talks could resume.
He also said Turkey's drilling for natural gas in waters where Cyprus' internationally recognised government has exclusive rights would continue as long as Greek Cypriots reject a proposal to jointly run a hydrocarbons search with the breakaway Turkish Cypriots.
Cavusoglu dismissed a counter-proposal from Anastasiades: splitting potential gas proceeds with the Turkish Cypriots in proportion to their population if Turkey agreed to negotiate the borders of Cyprus and Turkey's offshore economic zones.
Turkey has been split into an internationally-recognised Greek Cypriot south and a breakaway Turkish Cypriot north since 1974, when Turkey invaded following a coup aimed at uniting the island with Greece.
Turkey continues to maintain more than 35,000 troops in the northern third of the island, which only Turkey recognises as an independent state.
Reunification talks have dragged on, with long periods of interruptions, for decades.
Mitsotakis and Anastasiades "repeat their absolute will for the resumption of substantive negotiations that will lead to a viable and functional solution to the Cyprus problem," the two said in a joint statement released after their meeting.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 4:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.