భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం ఉభయతారకంగా కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇంధన భద్రతకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా చేయి-చేయి కలిపి ముందుకుసాగితే.. ప్రపంచ దేదీప్యమానం అవుతుందని అభిలషించారు. అమెరికా అభ్యున్నతికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని ట్రంప్ ప్రశంసించారు.
వుయ్ ద పీపుల్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా.. 'వుయ్ ద పీపుల్' అనే మూడు పదాలే ప్రధాన అంశాలగా సాగుతున్నాయని ట్రంప్ అన్నారు. ఇరుదేశాలు కలిసి ముందుకు సాగితే ప్రపంచ భవిష్యత్ కూడా మారిపోతుందని అభిప్రాయపడ్డారు.
వాణిజ్యం
భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం... ఉభయతారకంగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇంధన భద్రతకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
"ఇంధన భద్రతకు మించిన ప్రధాన అంశం మరొకటి లేదు. ప్రపంచంలోనే తొలిసారి ఇంధన వనరులు కలిగిన అతిపెద్ద దేశంగా అమెరికా అవతరించింది. అమెరికా నుంచి ఏడాదికి 5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ కొనేందుకు భారత్ సంస్థ ఒప్పందం చేసుకుందని తెలిసి నేను చాలా సంతోషించాను. తద్వారా భవిష్యత్‌లో వేల కోట్ల డాలర్ల ఇంధనం అమెరికా నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యేందుకు దారులు పడ్డాయి."
"ప్రస్తుతం భారతీయ అమెరికన్లు... అమెరికా అభివృద్ధికి, భవిష్యత్ కోసం కృషిచేస్తున్నారు. భారతీయ అమెరికన్లు వైద్యరంగంలో నూతన ఔషధాలతో ఎన్నో జీవితాలు కాపాడేందుకు కారణమవుతున్నారు. ప్రపంచ గతినే మార్చే విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. కొత్త కొత్త వ్యాపార మార్గాలను ఆవిష్కరించడం ద్వారా ఎంతోమంది ఉద్యోగాలకు బాటలు వేస్తున్నారు. మన రెండు దేశాలు... గతంలో ఏనాడూ లేని విధంగా..... ముందుకు సాగే దిశలో మీతో కలిసి పనిచేయాలని నేను భావిస్తున్నాను. గతంలో ఎన్నడు లేని విధంగా భారతీయులు కూడా.... ఇప్పుడు అమెరికాలో పెట్టబడులు పెడుతున్నారు.... అంటే నా ఉద్దేశంలో మేం(అమెరికన్లు) భారత్‌లో పెడుతున్నట్టే."-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇదీ చూడండి: పాక్కు షాక్... 'హౌడీ మోదీ'లో ట్రంప్ పరోక్ష సందేశం