ETV Bharat / business

ఫేస్‌బుక్‌ సెర్చ్‌ ఫిల్టర్స్‌ని ఎలా వాడాలంటే.. - ఫేస్‌బుక్‌ సెర్చ్‌.. ఫిల్టర్స్‌ని ఎలా వాడాలి?

స్నేహితులు, కొత్త వ్యక్తుల మధ్య భావవ్యక్తీకరణకు ఉపయోగపడే సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​. అంతగా వినియోగదారులకు చేరువైన ఫేస్​బుక్​లో ఇప్పటికీ చాలామందికి అనేక సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సెర్చింగ్​ ఆప్షన్​లో గందరగోళం అంతా ఇంతా కాదు. ఒకే పేరుతో అనేక ప్రొఫైల్స్​ ఉండటం వల్ల.. కావాల్సిన దాన్ని వెతుక్కోవడం కష్టంగానే ఉంటుంది. అయితే.. అలాంటి ఇబ్బందులను ఈ ఆప్షన్స్​తో అధిగమించొచ్చు. ఆ వివరాలు మీకోసం...

How to use the Facebook search Filters Effectively
ఫేస్‌బుక్‌ సెర్చ్‌.. ఫిల్టర్స్‌ని ఎలా వాడాలి?
author img

By

Published : Sep 16, 2020, 9:54 PM IST

Updated : Sep 16, 2020, 11:00 PM IST

ఫేస్‌బుక్‌.. భావ వ్యక్తీకరణకు, స్నేహితుల నుంచి కొత్త వ్యక్తుల వరకు ఎవరితోనైనా సంభాషించేందుకు, అభిప్రాయాలను పంచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే ఏకైక సామాజిక మాధ్యమం. ఇంతలా యూజర్స్‌కి చేరువైన ఫేస్‌బుక్‌ను ఉపయోగించడంలో ఇప్పటికీ ఎన్నో సందేహాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు కావాల్సిన వ్యక్తులతోపాటు కంపెనీలు, ప్రదేశాల వివరాలు ఎంత వెతికినా ఒక పట్టాన దొరకవు. ఎందుకంటే ఆ పేరుతో ఎన్నో ప్రొఫైల్స్ ఉంటాయి. అయితే ఫేస్‌బుక్‌ సెర్చ్‌ ఆప్షన్‌ని సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందొచ్చు. మరి ఫేస్‌బుక్‌ సెర్చ్‌లో ఏమేం ఉంటాయి? అవి మనకు ఎలా ఉపయోపడతాయో తెలుసుకోండి..

సెర్చ్ రిజల్ట్‌

ఉదాహరణకు మనం వెతుకున్న అంశానికి సంబంధించిన పదాన్ని ఫేస్‌బుక్‌ సెర్చ్‌లో టైప్ చేశాం. వెంటనే మీకు అందుకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితా కనిపిస్తుంది. అయితే మీకు స్క్రీన్‌ మీద కనిపించే ఆ జాబితా... మీరు టైప్‌ చేసిన పదాలు, మీరున్న లొకేషన్ ఆధారంగా సెర్చ్‌ రిజల్ట్‌ ఆటోమేటిగ్గా జనరేట్ అవుతుంది. ఆ జాబితాను స్క్రోల్‌ చేస్తూ కిందకు వెళితే మీకు పబ్లిక్‌ పోస్ట్‌లు, దానికి సంబంధించిన గ్రూప్స్‌, పేజస్‌ ఫొటోలు, వీడియోల రూపంలో పెద్ద జాబితా కనబడుతుంది. అలా మీకు కావాల్సిన అంశం గురించిన సమాచారాన్ని పొందవచ్చు. అయితే మీరు వెతుకుతున్న సమాచారం మరింత సులభంగా పొందాలంటే మాత్రం ఫేస్‌బుక్‌ సెర్చ్‌ ఫిల్టర్స్‌ ఉపయోగించాల్సిందే.

ఫేస్‌బుక్‌ సెర్చ్‌ ఫిల్టర్స్‌

Facebook search Filter options
ఫేస్‌బుక్‌ సెర్చ్‌ ఫిల్టర్స్‌

ఫేస్‌బుక్‌ను యూజర్స్‌కు మరింత చేరువ చేయడంలో బాగంగా ఇటీవల సెర్చ్‌ ఫిల్టర్స్‌లో కీలక మార్పులు చేశారు. గతంలో సెర్చ్‌లో పోస్ట్‌ ఎక్కడి నుంచి చేశారు, అది ఏ కేటగిరి, పోస్టయిన తేదీ, గ్రూప్‌, లొకేషన్‌ వంటి ఫిల్టర్‌లు మాత్రమే ఉండేవి. తాజా మార్పుల్లో వాటి స్థానంలో ఫేస్‌బుక్‌ పేజ్‌ ఎడమ వైపున సెర్చ్‌పై క్లిక్‌ చేస్తే మీకు పెద్ద ఫిల్టర్స్‌ జాబితా కనబడుతుంది. అందులో పోస్ట్స్‌, పీపుల్, ఫొటోస్‌, వీడియోలు, మార్కెట్ ప్లేస్‌, పేజస్‌, ప్లేసెస్, గ్రూప్స్‌, యాప్స్, ఈవెంట్స్‌, లింక్స్‌ లాంటివి ఎన్నో కనిపిస్తాయి. వీటితో మన సెర్చ్‌ రిజల్ట్‌ మరింత మెరుగ్గా లభిస్తుంది.

పోస్ట్స్‌ (Posts)

Facebook search Filter options
పోస్ట్స్‌

సెర్చ్‌ ఫిల్టర్స్‌లో మొదటిది ‘పోస్ట్స్‌’. ఇందులో నాలుగు సబ్‌ ఫిల్టర్స్‌ ఉంటాయి. సెర్చ్‌లో మీరు టైప్‌ చేసిన అంశం ఆధారంగా దానికి సంబంధించి మీరు గతంలో చూసిన పోస్ట్‌లు తేదీల వారీగా, ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు వాటిని పోస్ట్‌ చేశారు? వంటి వివరాలు తెలుసుకోవచ్చు. అలానే వాటిలో మీరు, మీ స్నేహితులు, ఇతర పేజీలు, గ్రూప్‌లు చేసిన పోస్టులను కూడా చూడొచ్చు.

పీపుల్ (People)

Facebook search Filter options
పీపుల్​

తర్వాతి ఫిల్టర్‌ ‘పీపుల్’. మీ ఫ్రెండ్స్‌కు ఫ్రెండ్స్‌ నుంచి మీరు ఉన్న నగరం, మీ చదువు, మీరు పనిచేస్తున్న కంపెనీ వంటి వాటి ఆధారంగా సెర్చ్‌ రిజల్ట్స్‌ను పొందొచ్చు. ఉదాహరణకు మీరు టూరిజం అని టైప్‌ చేశారనుకుందాం. సబ్‌ఫిల్టర్స్‌లో సిటిలోకి వెళ్తే అక్కడ మీ ప్రొఫైల్‌లో ఉన్న నగరాల జాబితా చూపిస్తుంది. వాటిలో ఒక దానిపై క్లిక్‌ చేస్తే టూరిజం రిలేటెడ్ సమాచారంతో పాటు దానికి సంబంధించిన వ్యక్తులు, ప్రదేశాలకు సంబంధించిన సమాచారం చూపిస్తుంది.

ఫొటోస్‌ (Photos)

Facebook search Filter options
ఫొటోస్​

ఫేస్‌బుక్‌ సెర్చ్‌లో ఎక్కువ మంది వెతికేది ఫొటోస్‌ కోసం. ఇందులో కూడా నాలుగు సబ్‌ఫిల్టర్స్‌ ఉంటాయి. వాటిలో మీ ఫ్రెండ్స్‌ లేదా వాళ్ల ఫ్రెండ్స్‌ లేదా వాళ్లు సభ్యులుగా ఉన్న గ్రూప్స్‌ పోస్ట్ చేసిన ఫొటోలను చూడొచ్చు. అలానే ఏ ప్రదేశంలో ఏ సంవత్సరంలో వాటిని తీశారు వంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అలా మీరు టైప్‌ చేసిన పదానికి సంబంధించిన రిజల్ట్‌ పొందొచ్చు.

వీడియోస్‌ (Videos)

Facebook search Filter options
వీడియోస్​

వీడియోస్‌ ఫిలర్ట్‌లో కూడా ఐదు సబ్‌ కేటగిరీలు ఉంటాయి. వాటిలో ఎక్కవ మంది చూసినవి, ఇటీవలి కాలంలో తీసిన వీడియోలను చూడొచ్చు. అలానే రోజు, వారం, నెల ఆధారంగా ఫిల్టర్‌ చేయవచ్చు. లైవ్‌ వీడియోలు, గ్రూప్స్‌ పోస్ట్‌ చేసిన వీడియోలతో పాటు లొకేషన్‌ ఆధారంగా మరింత మెరుగ్గా సెర్చ్‌ చేయొచ్చు.

మార్కెట్‌ ప్లేస్‌ (Market place)

Facebook search Filter options
మార్కెట్​ ప్లేస్​

మార్కెట్‌ప్లేస్‌ ఫేస్‌బుక్‌ సెర్చ్‌లో ఒక ఫిల్టర్‌ మాత్రమే. అయినా కూడా ఇది ఒక ప్రత్యేక సెర్చ్‌ ఆప్షన్‌ తరహాలో పనిచేస్తుంది. ముందుగా మార్కెట్‌ప్లేస్‌పై క్లిక్‌ చేస్తే ఫిల్టర్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాంట్లో మీరు ఉంటున్న నగరం వివరాలను చూపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీకు కావాల్సిన ప్రదేశం వివరాలను ఎంటర్‌ చేయాలి. తర్వాత పైన ఉన్న సెర్చ్‌ బార్‌లో మీరు దేనికోసం వెతుకుతున్నారో ఆ వివరాలను ఎంటర్‌ చేస్తే వాటి వివరాలను చూపిస్తుంది. ఈ-కామర్స్‌ సంస్థలకంటే మరింత మెరుగ్గా ఫేస్‌బుక్‌ మార్కెట్‌ప్లేస్‌ పనిచేస్తుందని టెక్‌ నిపుణులు అంటున్నారు.

ప్లేసెస్‌ (Places)

Facebook search Filter options
ప్లేసెస్​

మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు మీకు అక్కడ ఉన్న రెస్టారెంట్ల వివరాలు, టూరిస్ట్‌ ప్రదేశాల గురించి తెలుసుకునేందుకు ప్లేసెస్‌ ఫిల్టర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో మొత్తం ఏడు సబ్‌ ఫిల్టర్స్‌ ఉంటాయి. వాటిలో ధర, టైమింగ్స్‌, లొకేషన్‌తో పాటు ఇతర వివరాలతో కూడిన జాబితా మీకు దర్శనమిస్తుంది.

జాబ్స్‌ (Jobs)

ప్రదేశాల తర్వాత ఎక్కువ మంది వెతికేది ఉద్యోగాల కోసమే. ఫేస్‌బుక్‌ సెర్చ్‌లో ఉన్న జాబ్‌ ఫిల్టర్‌ ద్వారా మీరు ప్రపంచంలోని ఏ దేశంలో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. అయితే ఈ ఫిల్టర్‌ కొంతమంది యూజర్లకి మాత్రమే అందుబాటులో ఉంది. ఇవి కాకుండా ఈవెంట్స్‌, గ్రూప్స్‌, యాప్స్‌, లింక్స్‌ ఫిల్టర్స్‌తో సులువుగా సెర్చ్‌ చేయొచ్చు. ఈవెంట్స్ ఫిల్టర్‌తో ఏయే ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది కేటగిరీల వారీగా తెలుసుకోవచ్చు. అలానే గ్రూప్‌ ఫిలర్ట్ ద్వారా మీరు ఉంటున్న నగరంలో ఉన్న గ్రూపుల వివరాలు, వాటిలో పబ్లిక్‌, ప్రైవేటు గ్రూపులకు సంబంధించిన సమాచారం పొందొచ్చు.

ఇదీ చదవండి: మార్కెట్​లోకి ఇన్ఫినిక్స్ కొత్త మోడల్​- ఫీచర్లు ఇవే​

Last Updated : Sep 16, 2020, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.