ETV Bharat / business

ఆ వివరాలు గోప్యంగా ఉంచితేనే మీరు సేఫ్! - కరోనా పేరుతో సైబర్ క్రైమ్

కరోనా కారణంగా చాలా అవసరాలకు ఆన్​లైన్​ సేవలను వినియోగించుకుంటున్నాం. ఆన్​లైన్​ లావాదేవీలూ ఇటీవల భారీగా పెరిగాయి. ఇదే ఆసరాగా చేసుకుని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే... చిన్న చిన్న జాగ్రత్తలతో సైబర్​ మోసగాళ్ల వలలో పడకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సైబర్​ నేరాల నుంచి రక్షించుకునేందుకు వారు ఇస్తున్న సూచనలు, సలహాలు మీ కోసం.

beware of cyber crime
సైబర్ నేరాగాళ్లకు చెక్​పెట్టడిండిలా
author img

By

Published : May 10, 2020, 1:23 PM IST

కొవిడ్‌-19 మనకు అనేక కొత్త అలవాట్లు నేర్పింది. అన్ని పనులనూ ఆన్‌లైన్‌లోనే చక్కబెట్టుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. పెరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీల నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లూ విజృంభిస్తున్నారు. అమాయకులపై వల విసిరి, తెలివిగా డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ మోసాల బారిన మనం పడకుండా చూసుకోవాలంటే.. ఆన్‌లైన్‌లో ఎవరినీ నమ్మకపోవడం.. మన సమాచారాన్ని రహస్యంగా ఉంచడం.. దీనితోపాటు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే..

రుణ వాయిదాల చెల్లింపులపై ఆర్‌బీఐ మూడు నెలల మారటోరియం విధించింది. దీన్ని ఆసరాగా చేసుకొని, మోసగాళ్లు.. రుణగ్రహీతలకు ఫోన్‌ చేశారు. ఖాతాదారులకు మారటోరియం వర్తింపజేస్తామని చెబుతూ.. వారి ఖాతాల వివరాలు, ఆధార్‌, పాన్‌ తదితర సంఖ్యలను తెలుసుకుంటున్నారు. వారి చెప్పిన మాటలను నమ్మిన వారి ఖాతాల నుంచి వేల రూపాయలు ఖాళీ చేసిన సంఘటనలూ ఉన్నాయి.

  • అత్యవసర మందులు సరఫరా చేస్తామంటూ.. ఎన్నో కొత్తకొత్త లింకులు మనకు సంక్షిప్త సందేశాల రూపంలో వస్తున్నాయి. ముందుగా చెల్లిస్తేనే మందులు సరఫరా చేస్తామంటూ పేమెంట్‌ లింకులు పంపిస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించకండి. ఇంటికి వచ్చి మందులు ఇచ్చాకే డబ్బులు తీసుకునే వారికి ప్రాధాన్యం ఇవ్వండి.
  • ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్లు లేదా ఈ-మెయిళ్లను పంపించి.. మన ఆరోగ్య సమాచారాన్ని అడుగుతున్నట్లు మాట్లాడుతుంటారు. ఆ తర్వాత అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీ బ్యాంకు ఖాతాలోకి నేరుగా బదిలీ చేస్తామంటూ చెప్పి, మన సమాచారాన్ని సేకరిస్తారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకండి.. ఈ- మెయిళ్లలో ఇచ్చిన లింకులను క్లిక్‌ చేయొద్ధు
  • బ్యాంకు ఎప్పుడూ ఖాతాదారులకు నేరుగా ఫోన్‌ చేయదు. ఏదైనా సమస్య వస్తే.. ఖాతాదారులే వినియోగదారుల సేవాకేంద్రాన్ని సంప్రదించాలి. ఖాతా వివరాలు, పిన్‌, ఓటీపీలాంటివి అడిగారు అంటే.. వాళ్లు మోసగాళ్లేనని అర్థం చేసుకోవాలి.
  • మీ ఖాతా వివరాల్లో తేడాలున్నాయని, వాటిని సరిచేయాలని, లేకపోతే ఖాతా రద్దవుతుందని ఎవరైనా ఫోన్‌ చేస్తే.. ఆందోళన పడకండి. వారితో మాట్లాడకండి. వెంటనే కాల్‌ను ఆపేయండి. మీ ఖాతాలో చిన్న తేడా కనిపించినా, బ్యాంకును సంప్రదించాలి.
  • బ్యాంకు ఆన్‌లైన్‌ పాస్‌వర్డ్‌లతోపాటు, మొబైల్‌ వ్యాలెట్లకు వినియోగించే ఎంపిన్‌లాంటివి మార్చుకోండి. అక్షరాలు, అంకెలు, సంజ్ఞలతో పాస్‌వర్డ్‌ కఠినంగా ఉండేలా చూసుకోవాలి.

- భరత్‌ పంచాల్‌, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌- ఇండియా, ఎఫ్‌ఐఎస్‌

సైబర్‌ పాలసీతో..

లాక్‌డౌన్‌తో ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య పెరిగింది. కొత్తగా అనేకమంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు, ఇతర లావాదేవీలను నిర్వహించడం ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో మోసాలు జరిగితే.. ఆర్థిక నష్టం భరించడం చాలా కష్టం. దీన్ని నివారించేందుకు ఇప్పుడు సైబర్‌ బీమా పాలసీలను ఎంచుకోవాల్సిన అవసరముంది. అనేక సాధారణ బీమా సంస్థలు ఇప్పుడు ఈ పాలసీని అందిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్నవారు.. తమ స్థాయులను బట్టి, ఎంత మేరకు బీమా తీసుకుంటే మంచిదనేది నిర్ణయించుకోవాలి. వీటి ప్రీమియం అంత అధికంగానూ ఉండటం లేదు. వ్యక్తిగత రహస్య సమాచారం తస్కరణకు గురైనప్పుడు, బ్యాంకులో నుంచి మనకు తెలియకుండా నగదు తస్కరించినప్పుడు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. పాలసీ తీసుకునేటప్పుడు దేనికి వర్తిస్తుంది, మినహాయింపులేమిటి అని తెలుసుకోవాలి.

- టి.ఏ.రామలింగం, సీటీఓ, బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

ఇదీ చూడండి:కరోనా పాఠాలు.. రూపు మారుతున్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.