ETV Bharat / business

క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. అప్లై ఇలా.. - పీవీసీ ఆధార్​ కార్డ్ ధర

పర్సులో సులభంగా ఇమిడిపోయేంత చిన్న సైజు​లో​ ఆధార్​ కార్డు​ అందుబాటులోకి వచ్చింది. అచ్చం క్రెడిట్ కార్డు అంత పరిమాణంలో.. పీవీసీతో దీనిని రూపొందించారు. మరి దీన్ని పొందడం ఎలా? ధర ఎంత? అనే వివరాలు తెలియాలంటే ఈ కథనం చదివేయండి.

HOW TO GET PVC AADHAAR CARD
పీవీసీ ఆధార్​ కార్డ్​కు అప్లై చేయడం ఎలా
author img

By

Published : Oct 5, 2020, 4:44 AM IST

ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్సులో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేయడం ద్వారా సరికొత్త ఆధార్‌ను పొందొచ్చు. పది రోజుల్లో కొత్త ఆధార్‌ కార్డు మీ ఇంటికి చేరుతుంది.

అప్లై ఎలా చేయాలంటే..

select this option for apply
అప్లికేషన్​ కోసం ఈ ఆప్షన్ ఎంచుకోవాలి
  • పీవీసీ ఆధార్‌ కార్డు కోసం అప్లై‌ చేసేందుకు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
  • గెట్‌ ఆధార్‌ అనే చోట Order Aadhaar PVC Card అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి.
  • అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆధార్‌ కార్డు తాలూకా వర్చువల్‌ ఐడీని గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ అయినా ఎంటర్‌ చేయొచ్చు.
    application
    అప్లికేషన్​ ఇలా...
  • క్యాప్చా కోడ్‌, మీ ఆధార్‌తో లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.
  • మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయండి.
  • ఆ తర్వాతి పేజీలో మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
  • పేమెంట్‌ పేజీలోకి వెళితే మీకు అక్కడ క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. యూపీఐ ఆప్షన్స్‌లోకి వెళితే పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే, అమెజాన్‌ పేను ఉపయోగించి పేమెంట్‌ చేయొచ్చు.
    Payment option
    పేమెంట్‌ ఆప్షన్​
  • పేమెంట్‌ పూర్తయిన తర్వాత మీకు ఓ రసీదు వస్తుంది. అందులో ఎస్‌ఆర్‌ఎన్‌ నంబర్‌ను భవిష్యత్‌ అవసరాల కోసం సేవ్‌ చేసి పెట్టుకోండి.
  • పది రోజుల్లో మీ అడ్రస్‌కు కొత్త ఆధార్‌ కార్డు వస్తుంది. ఆధార్‌ కార్డు స్టేటస్‌ తెలుసుకోవాలంటే ఎస్‌ఆర్‌ఎన్‌ నంబర్‌ను ఉపయోగించి ఉడాయ్‌ వెబ్‌సైట్‌లో గెట్‌ ఆధార్‌ విభాగంలో స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఇదీ చూడండి:'కార్డు' లాభాలను అస్సలు వదులుకోవద్దు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.