ETV Bharat / business

మానసిక వ్యాధులకు ఎలాంటి బీమా మేలు?

author img

By

Published : Nov 9, 2020, 3:09 PM IST

పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ఇటీవలి కాలంలో చాలా మందికి మానసిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సాధారణ అనారోగ్యంతో పోలిస్తే.. వీటికి వైద్యం పూర్తి భిన్నంగా ఉంటుంది. మరి ఇలాంటి వ్యాధులకు ఆరోగ్య బీమాల్లో కవర్ లభిస్తుందా? ఒకవేళ లభిస్తే.. బీమా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

Does insurance cover mental health issues?
మానసిక వ్యాధులకు ఆరోగ్య బీమా

మానసిక వ్యాధులు.. వీటి గురించి ఇటీవల కాలంలో అవగాహన చాలా పెరిగింది. సినీ నటులు నుంచి సాధారణ మనిషి వరకు వీటికి బాధితులుగా మారుతున్న పరిస్థితి నెలకొంది. మానసిక వ్యాధులు ఎప్పుడు, ఎలా వస్తాయో చెప్పలేం. అయితే వీటి చికిత్స కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించిన బీమా ఉంటే ఖర్చులను తప్పించుకోవచ్చు.

భౌతికంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో పోల్చితే మానసిక అనారోగ్యం చాలా భిన్నమైనది. ఇది ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. మానసిన వ్యాధులపై గతంలో చాలా తక్కువ అవగాహన ఉండేది. ప్రస్తుతం వీటిపై శ్రద్ధ పెరుగుతోంది. ముందుగానే వీటిని గుర్తించటం, సరైన సమయంలో చికిత్స అందించటం వల్ల అవాంఛనీయ పరిణామాలను తగ్గించవచ్చు.

మానసిక సమస్యలతో పాటే వాటికి సంబంధించిన బీమాపైనా మక్కువ పెరుగుతోంది. చట్టం ప్రకారం ఆరోగ్య బీమాల్లో మానసిక అనారోగ్యానికి కవరేజీని బీమా సంస్థలు ప్రామాణికంగా అందిస్తున్నాయి. బీమా సంస్థలు ప్రస్తుతం మానసిక, భౌతిక ఆరోగ్యాన్ని ఒకే రకంగా పరిగణిస్తున్నాయి.

ఔట్ పేషెంట్ చికిత్స ఎక్కువ..

సాధారణ ఆరోగ్య సమస్యలతో పొలిస్తే మానసిక ఆరోగ్యానికి చికిత్స కొంత భిన్నంగా ఉంటుంది. ఆరోగ్య బీమాల ద్వారా మానసిక అనారోగ్యానికి సంబంధించి పూర్తి ప్రయోజనం పొందలేరు. మానసిక సమస్యలతో బాధపడే వారు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మానసిక వైద్యులతో ఔట్ పేషెంట్ ద్వారా కౌన్సిలింగ్​లతో చికిత్స ప్రారంభమౌతుంది.

కౌన్సిలింగ్ ఖర్చులకే సరిపోతున్నాయ్​..

ఎక్కువ పాలసీలు ఈ ఓపిడీ ఖర్చులకు కవరేజీ ఇవ్వవని, కేవలం ఆస్పత్రిలో ఉండే ఇన్ పేషెంట్ల ఖర్చులకే కవరేజీ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్రమక్రమంగా ఆవుట్ పేషెంట్ ఖర్చులను కూడా పాలసీలో ఇస్తున్నప్పటికీ.. తక్కువ మొత్తం కవరేజీ ఇస్తున్నాయని వారు అంటున్నారు. ఈ మొత్తం చాలా తక్కువ కౌన్సిలింగ్ సెషన్లకే సరిపోతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

కొన్ని బీమా కంపెనీలు ఆరోగ్య పాలసీల్లో ఓపీడీని పొందుపరుస్తున్నాయి. అయితే రూ.10 నుంచి రూ.15 లక్షల పాలసీలో రూ.10వేల నుంచి రూ.20వేల వరకు మాత్రమే కవరేజీ ఇస్తున్నాయి. ఇందుకోసం పాలసీ తీసుకునే ముందే ఓపీడీ కవరేజీ గురించి తెలుసుకోవాలి.

"ఆరోగ్య బీమా మానసిక వైద్యానికి కూడా వర్తించాలంటే ఓపీడీ ఉన్న పాలసీని మాత్రమే ఎంచుకోవాలి. ఓపీడీకి సంబంధించి బీమా కంపెనీల పలు పాలసీలను అందిస్తున్నాయి."

- నవల్ గోయల్, సీఈఓ పాలసీ ఎక్స్.

అలాంటప్పుడు కవరేజీ కష్టమే..

మానసిక అనారోగ్యానికి సంబంధించి ఆస్పత్రిలో ఉండాల్సి కూడా రావొచ్చు. మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల్లో ఆస్పత్రిలో ఎప్పుడు చేరాల్సి ఉంటుందన్న దానిపై ప్రామాణికత ఉంటుంది. అయితే మానసిక సమస్యలకు సంబంధించి ఎప్పటి వరకు ఆస్పత్రిలో ఉండాలన్న దానిపై ఇది ఉండదు.

కొందరు మెడికల్ కేర్ సెంటర్లలో చేరాల్సి ఉంటుందని, ఇవి ఆస్పత్రిగా పరిగణనలోకి రావు కాబట్టి వీటికి బీమా పాలసీని కవరేజీ రాదని నిపుణులు అంటున్నారు. డ్రగ్స్ అడిక్షన్ లాంటి విషయాల్లో డీఅడిక్షన్ సెంటర్లలో చేర్పించాల్సి ఉంటుందని.. ఇవి కూడా ఆస్పత్రులు కావు కాబట్టి కవరేజీ ఉండదని వారు చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలో చేరిన అనంతరం మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుతోందని కొందరు వైద్యులు చెబుతున్నారు. పాలసీ తీసుకునే సమయంలో మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి గురించి పాలసీ ఇచ్చే సంస్థకు తెలియజేయాలి.

ఇదీ చూడండి:సంక్షోభంలోనూ ఆర్థిక భరోసాకు ఐదు సూత్రాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.