ETV Bharat / business

లాక్​డౌన్​ వేళ వేతన గండం గడిచేదెలా? - కరోనా వార్తలు తెలుగు

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో దేశంలోని చాలా సంస్థలు గత కొన్ని రోజులుగా మూతపడ్డాయి. అత్యవసర సేవలుగా పరిగణించిన కొన్ని సంస్థలు మాత్రమే పని చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయం లేక చిన్న చిన్న సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని సంస్థలు పని చేసేందుకు అవకాశం ఉన్నా సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, బ్యాంకులే తమను రక్షించాలని కోరుతున్నాయి పలు సంస్థలు.

lockdown crisis on jobs
వేతన గండం గడిచేదెలా
author img

By

Published : Apr 3, 2020, 6:35 AM IST

అత్యవసరాలుగా ప్రకటించిన సేవలు, ఉత్పత్తులకు సంబంధించిన సంస్థలు మినహా మిగిలినవన్నీ కరోనా లాక్‌డౌన్‌ వల్ల మూతబడే ఉన్నాయి. మార్చి 21న జనతా కర్ఫ్యూతో ప్రారంభించి, ఏప్రిల్‌ 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఇందువల్ల వేతనాలు అందక చిన్న సంస్థల్లోని ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగులను తొలగించవద్దని, వారికి వేతనాలు పూర్తిగా అందచేయాలని ప్రభుత్వం కోరింది. ఉద్యోగులు విధులకు రాకున్నా, వచ్చినట్లే పరిగణించాలని కోరడంతో, పనిచేస్తున్న కంపెనీల్లో కూడా కొందరు గైర్హాజరవుతున్నారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలంటే కొన్ని చెల్లింపుల నుంచి ప్రభుత్వం తమకు మినహాయింపు ఇవ్వాలని, ఛార్జీల విషయంలో బ్యాంకులూ ఆదుకోవాలన్న విజ్ఞప్తి కంపెనీల నిర్వాహకుల నుంచి వస్తోంది.

కార్యకలాపాలు ఆపేసినా, ఉద్యోగులకు వేతనాలు ఆపొద్దన్న ప్రభుత్వ సూచన అమలు చేసేందుకు సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల్లో అధికం ఇబ్బంది పడుతున్నాయని సమాచారం. ఆదాయం అసలే లేకపోవడం / బాగా తగ్గడం ఇందుకు కారణం. రుణాల నెలవారీ చెల్లింపులను 3 నెలల పాటు వాయిదా వేసినా, అది పెద్దగా కలిసి రాదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఔషధ, ఎఫ్‌ఎంసీజీ వంటి కంపెనీలు పనిచేసేందుకు అనుమతులున్నా, ముడి పదార్థాల సరఫరా సమస్యలకు తోడు కార్మికుల హాజరు తక్కువగా ఉంటున్నందున ఉత్పత్తి కష్టమవుతోందని దిగ్గజ సంస్థలు ఐటీసీ, హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌), దివీస్‌ లేబొరేటరీస్‌ వంటి సంస్థలు ప్రకటించడం గమనార్హం. మారికో, నెస్లే, డాబర్‌, ఇమామీ వంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలూ ఉత్పత్తి తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. ఇలాంటి దిగ్గజాలే ఇలా చేస్తే, మార్జిన్లు తక్కువగా ఉండే తమ పరిస్థితి ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవాలని ఎంఎస్‌ఎంఈలు పేర్కొంటున్నాయి. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ (ఈఎస్‌ఐ) పథకం ద్వారా ప్రయోజనాలు పెంచేందుకు చూస్తున్నా, అవి అంతంతమాత్రమేనని చెబుతున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే, లాక్‌డౌన్‌ ముగిసేనాటికి 5-7 లక్షల చిన్న సంస్థలు మూతబడి, భారీగా ఉద్యోగులు రోడ్డున పడతారనే ఆందోళనా ఆయా వర్గాల్లో వ్యక్తమవుతోంది.

జీతం వస్తుందనే ధీమాతో..

పనులు లేక అసంఘటిత కార్మికులు ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వ ప్రకటన మేరకు వేతనం వస్తుందనే ధీమాతో, కార్యకలాపాలు సాగిస్తున్న పరిశ్రమల్లోని కొందరు కార్మికులు ఏదో వంకతో విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. పెద్ద కంపెనీలు బస్సుల్లో ఉద్యోగులను తీసుకెళ్తున్నాయి. కానీ చిన్న కంపెనీల్లో ఈ పరిస్థితి లేకపోవడం, సొంత వాహనాలపై వెళ్తుంటే పోలీసులు నిలుపుతున్నారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇందువల్ల ముడిపదార్థాలు, ఉత్పత్తుల సరఫరాకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే ప్యాకేజ్డ్‌ ఆహారం నిల్వలు 10 రోజులకు మించి ఉండవనే ఆందోళనను కొన్ని కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి.

చట్ట ప్రకారం..

విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం వేతనాలు యథాతథంగా కొనసాగించాల్సిన అవసరం లేదని, పారిశ్రామిక వివాదాల చట్ట ప్రకారమైనా లేఆఫ్‌ సమయంలో 50 శాతం ఇస్తే సరిపోతుందనీ కొందరు నిర్వాహకులు చెబుతున్నారు. అనుకోని ఉపద్రవం వల్లే 10 రోజుల మూసివేత సంభవించింది కానీ, ఉద్యోగుల కారణంగా కాదు కనుక సర్దుకుపోయే ధోరణే సంస్థలకు మేలు చేస్తుందని మరికొందరు అంటున్నారు.

సంస్థలేం కోరుతున్నాయంటే..

'లాక్‌డౌన్‌ కారణంగా వేతనాలు ఆపి, సిబ్బందిని ఇబ్బందుల పాల్జేయాలని మాకు లేదు. కానీ మాకు ఆదాయం ఉంటే కదా.. వారి సంక్షేమం చూడటానికి' అని తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు నిర్వహిస్తున్న ఒక యజమాని పేర్కొన్నారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ సమస్యగా మారిందని, ఈ విషయంలో బ్యాంకులు ఆదుకోవాలని కోరుతున్నారు.

100 మంది ఉద్యోగుల కంటే తక్కువ ఉన్న సంస్థల్లోని సిబ్బంది పీఎఫ్‌ను ప్రభుత్వం చెల్లిస్తామంటోంది. మొబైల్‌, రిటైల్‌ గొలుసుకట్టు విక్రయశాలలు నిర్వహిస్తున్న సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. తమకూ ఈ అవకాశం కల్పించాలని, లేదా మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి. ఈఎస్‌ఐ చెల్లింపునూ 3 నెలలకు మినహాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

నివాసాలకు సంబంధించి, బలవంతంగా అద్దె వసూలు చేయొద్దని ప్రభుత్వం కోరింది. ఇదేవిధానాన్ని వాణిజ్య సంస్థలకు వర్తింప చేయాలని సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మొబైల్‌ విక్రయసంస్థలు ఇప్పటికే ఈ విషయమై ఏకతాటిపైకి వచ్చాయని, మూసి ఉన్న రోజులకు అద్దె చెల్లించబోమని భవన యజమానులకు చెబుతున్నట్లు సమాచారం.

సిబ్బందికి కొంతకాలం మాత్రం అవసరాలకు సరిపడా నగదు ఇవ్వగలం గానీ, లాక్‌డౌన్‌ మరింతకాలం కొనసాగితే, తమకూ కష్టమేనని జౌళి కంపెనీల యాజమాన్యాలూ చెబుతున్నాయి.

విద్యుత్తు ఛార్జీలు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను, వడ్డీ మాఫీ కోసం బ్యాంకులకు విజ్ఞప్తి చేసేందుకు సంస్థలు సంఘటితంగా యత్నిస్తున్నాయి.

రాకపోకలపై అధిక ఆంక్షల వల్ల పెట్రోల్‌ బంకుల సాధారణ వ్యాపారంలో 10 శాతమే జరుగుతోందని, అందువల్ల పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని వాటి యజమానులు కోరుతున్నారు.

అంకుర సంస్థల్లో కోతలు షురూ

‘వేతనాల్లో కోత అమలు చేయక తప్పదు. ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేయండి’ అంటున్నాయి అంకుర సంస్థలు. కొన్ని సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటుండగా, ఎగ్జోటెల్‌ అనే సంస్థ రాబోయే 2 నెలలకు గరిష్ఠ వేతనంగా రూ.40,000ను నిర్ణయించింది. వ్యాపారం మెరుగుపడ్డాక, ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూరుస్తామని చెబుతున్నాయి. ‘ఉద్యోగుల భద్రతకే ప్రాధాన్యమివ్వండి. తదుపరే వ్యాపారాన్ని చూడండి.. మరో నెల రోజుల వరకు మరింత గడ్డు పరిస్థితులు తప్పవు కనుక సిద్ధంగా ఉండాలంటూ’ కలారి, సైఫ్‌ పార్ట్‌నర్స్‌, యాక్సెల్‌ వంటి వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు హెచ్చరికలు చేయడం, సాధారణ పరిస్థితులు ఎప్పటికి ఏర్పడతాయో తెలీనందునే ఈ చర్యలు తీసుకుంటున్నాయి. వచ్చే రెండేళ్ల కాలానికి భవిష్య ప్రణాళికల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి.

ఇరుచేతులు కలిస్తేనే..

అత్యవసర రంగాల్లోని సిబ్బంది సాధ్యమైనంతగా విధులకు హాజరు కావడం వల్ల, వ్యాపారాలు సజావుగా సాగడంతో పాటు దేశానికీ మేలు కలుగుతుంది.

కంపెనీలు కూడా ప్రస్తుత క్లిష్ట పరిస్థితులే అదనుగా, ఉద్యోగాల్లో కోత విధించకూడదు. ఉద్యోగుల సంక్షేమానికి తమ స్థోమత మేర కృషి చేస్తే సాజామిక అశాంతికి చోటుండదు.

ఇదీ చూడండి:ఏప్రిల్ 15 తర్వాత అంతర్జాతీయ విమానాలకు అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.