ETV Bharat / business

'కరోనిల్​' సేఫేనా? క్లినికల్​ ట్రయల్స్ రిజల్ట్ ఏంటి? - coronil patanjali tablet

భారత్​లో కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా రోజుకో సంస్థ ఒక్కో రకమైన మందును తీసుకొస్తోంది. అయితే ఇప్పటివరకు జనరిక్ ​మందులే రాగా... తాజగా భారత అస్త్రం ఆయుర్వేదం నుంచి సరికొత్త మెడిసిన్​ అందుబాటులోకి వస్తోంది. దాన్ని 'కరోనిల్' పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది పతంజలి సంస్థ. అయితే ఈ మందును క్లినికల్స్​ ట్రయల్స్​లో వినియోగించారా? ఎలా తయారు చేశారు? ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది? అనే ప్రశ్నలకు సంస్థ వివరణ ఇచ్చింది.

coronil Ayurveda medicine
కరోనాకు ఆయుర్వేద మందు.. క్లినికల్​ ట్రయల్స్ ఫలితాలేంటి?
author img

By

Published : Jun 23, 2020, 6:20 PM IST

భారత్​లో కరోనా చికిత్సకు మరిన్ని ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే గ్లెన్​ ఫార్మా, హెటిరో, సిప్లా సంస్థలు కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే కొన్ని మెడిసిన్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తాజాగా అదే జాబితాలోకి చేరింది స్వదేశీ ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ పతంజలి. ఈ సంస్థ వారంలో కరోనా మందును దివ్య 'కరోనిల్​' పేరిట మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డ్రగ్​పై పతంజలి రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​, నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్స్​స్​-జైపుర్​ సంయుక్తంగా పరిశోధనలు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హరిద్వార్​లోని దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్​ లిమిటెడ్​ కలిసి దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

క్లినికల్​ ట్రయల్స్​లో 'కరోనిల్​' పనితీరు?

'ఈ ఆయుర్వేద మందుపై పరిశోధనలకు డీసీజీఐ (డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి ఇవ్వగానే.. ఇండోర్​, జైపుర్​లో క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించాం. దేశంలో కొవిడ్​-19 కేసు రాగానే.. శాస్త్రవేత్తల బృందం డ్రగ్​ తయారీలో నిమగ్నమైంది. కొంతమందికి పాజిటివ్​ వచ్చిన వ్యక్తులపై ఈ మందును ప్రయోగించాం. మూడు రోజుల పరిశీలనలో ఈ మందుతో 69 శాతం మందికి నెగిటివ్‌ వచ్చింది. అలాగే 7 రోజుల్లో 100 శాతం మంది కోలుకున్నారు. 'కరోనిల్'‌ మాత్రల ద్వారా 5 నుంచి 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చు' అని వివరించారు పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ.

coronil Ayurveda medicine
కరోనిల్​ ఆవిష్కరణలో బాబా రాందేవ్​, సీఈవో ఆచార్య బాలకృష్ణ(కుడివైపు)

ఎలా తయారు చేశారంటే..?

గిలోయ్​​, అశ్వగంధ, తులసి, స్వసర్జి రసం, ప్రత్యేకమైన నూనెల మిశ్రమంతో ఈ డ్రగ్​ తయారు చేశాం. ప్రతిరోజు ఈ మందును ఉదయం, సాయంత్రం సేవించాలి.

ఖరీదు ఎంత?

కరోనిల్‌ కిట్‌ ధరను రూ.545గా నిర్ణయించాం. ఇది 30రోజులకు సరిపోతుంది. ప్రస్తుతం ఇది అన్నిచోట్లా లభ్యం కాదు. కేవలం పతంజలి స్టోర్స్‌లోనే లభిస్తుంది. అందుకు మరో వారం రోజుల సమయం పట్టవచ్చు.

coronil Ayurveda medicine
కరోనిల్ కిట్​

కరోనాపై ఫలితాలెలా?

ఈ మందులో వాడిన అశ్వగంధ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్‌ యాసిడ్‌ పెంథాల్‌ ఈస్ట్‌ అనే క్రియాశీలక పదార్థాలకు వైరస్‌తో పోరాడే శక్తి ఉంది. ఈ ఔషధం వల్ల శరీరంలోని కణాలు.. కరోనాను ఎదుర్కోగలుగుతాయి. గిలోయ్​ మూలిక కరోనా ఇన్ఫెక్షన్​ను తగ్గిస్తుంది. తులసి కరోనా ఆర్​ఎన్​ఏపై దాడి చేసి.. వ్యాధి పెరగకుండా అదుపు చేస్తుంది.

ఇది ట్యాబెట్ల రూపంలో దొరుకుతుందా?

దివ్య కరోనిల్​ ట్యాబ్లెట్​.. మంగళవారం నుంచే మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. శ్వాసకోసంలో శ్లేష్మం ఏర్పడకుండా ఇది నియంత్రిస్తుంది. అంతేకాకుండా గొంతులో మంటను కూడా తగ్గిస్తుంది.

భారత్​లో ఇప్పటికే సిప్రిమిని, ఫ్యాబిఫ్లూ, కొవిఫర్‌ మందులు కరోనా చికిత్సకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని బాధితులపై వాడేందుకు డీసీజీఐ అనుమతినిచ్చింది. 'కరోనిల్'​కు మాత్రం చికిత్సలో వాడేందుకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది.

ఇదీ చూడండి: ఫ్యాబిఫ్లూ టు కొరోనిల్... ఏ మందు ఎవరికి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.