ETV Bharat / business

ఫుల్-స్క్రీన్‌ డిస్‌ప్లేతో తొలి స్మార్ట్‌ వాచ్‌

రియల్‌మీ, హానర్‌ కంపెనీలు కొత్త స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఫుల్-స్క్రీన్‌ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ వాచ్‌లను సంస్థలు రూపొందించాయి. వాటి ధరలు, ఫీచర్స్​ను ఒకసారి పరిశీలిస్తే..

honor and realme launches smart watches
ఫుల్-స్క్రీన్‌ డిస్‌ప్లేతో తొలి స్మార్ట్‌ వాచ్‌
author img

By

Published : Nov 28, 2020, 9:51 PM IST

గత కొద్ది నెలలుగా మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌లు సందడి చేస్తున్నాయి. కొవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో రోజు రోజుకి వీటికి వినియోగం పెరుగుతోంది. 24X7 హెల్త్‌ మానిటరింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌ ట్రాకింగ్ వంటి ఫీచర్స్‌తో ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచుతుండటంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

హానర్‌ బ్యాండ్ 6

honor and realme launches smart watches
హానర్‌ బ్యాండ్ 6

స్మార్ట్‌వాచ్‌ మోడల్స్‌లో తొలిసారి ఫుల్-స్క్రీన్ డిస్‌ప్లేతో హానర్‌ బ్యాండ్ 6ను తీసుకొచ్చారు. ఇందులో 1.47 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్‌ ప్రొటెక్షన్ ఉంది. 100కు పైగా డయల్‌ ఫేసెస్‌ ఉన్నాయి. 180 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజులు, ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో రెండు రోజులు పాటు పనిచేస్తుంది. 50 మీటర్ల లోతూ వరకు నీళ్లలో పనిచేస్తుంది. హువావే ట్రూసీన్‌ 4.0 టెక్నాలజీతో 24 గంటలు హార్ట్‌రేట్‌ను మానిటర్‌ చేస్తుంది. స్లీప్‌ ట్రాకింగ్, బ్లడ్‌ ఆక్సిజన్ సెన్సర్‌తో పాటు మహిళల కోసం ప్రత్యేక ఫీచర్స్‌ ఉన్నాయి. 10 రకాల స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఇస్తున్నారు.

రియల్‌మీ వాచ్‌ ఎస్‌

honor and realme launches smart watches
రియల్‌మీ వాచ్‌ ఎస్‌

వాయిస్‌ కంట్రోల్‌, డిజిటల్ అసిస్టెంట్‌తో పాటు ఎన్‌ఎఫ్‌సీ (నియర్ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) వేరియంట్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ను సపోర్ట్ చేస్తుంది. నోటిఫికేషన్స్‌, అలారమ్‌, రిమైండర్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్‌ చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడి మార్కెట్లో దీని ధర 249 యువాన్లు. అంటే మన కరెన్సీలో రూ. 2,800. ఎన్‌ఎఫ్‌సీ వేరియంట్ ధర 289 యువాన్లు. మన కరెన్సీలో రూ. 3,300. నవంబరు 11 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. కొరల్ పౌడర్‌, మెటియోరైట్ బ్లాక్‌, సీగల్ గ్రే, రంగుల్లో లభిస్తుంది. త్వరలోనే భారతలో విడుదల చేస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

వాచ్‌ ఎస్‌లో 1.3 అంగుళాల గుండ్రటి అల్యూమినియం డయల్‌తో టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇందులోని ఫొటోసెన్సిటివ్‌ సెన్సర్ లైటింగ్‌ పరిస్థితులకు అనుగుణంగా వాచ్‌ డిస్‌ప్లే లైటింగ్‌లో ఆటోమేటిగ్గా మార్పులు చేస్తుంది. వాచ్‌తో పాటు బ్లూ, ఆరెంజ్‌, గ్రీన్‌, బ్లాక్‌ రంగుల్లో లిక్విడ్ సిలికాన్‌ స్ట్రాప్స్‌ను ఇస్తున్నారు. సుమారు 100 వాచ్‌ ఫేసెస్‌ ఉంటాయని తెలుస్తోంది. ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్‌తో పాటు 16 రకాల స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఇస్తున్నారు. పీపీజీ హార్ట్‌రేట్ సెన్సర్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్‌ లెవల్స్‌ మానిటర్‌ చేసేందుకు ఎస్‌పీఓ2 సెన్సర్‌, స్లీప్ మానిటరింగ్, కాల్ రిజక్షన్‌, స్మార్ట్ నోటిఫికేషన్స్‌, మ్యూజిక్‌, కెమెరా కంట్రోల్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. 390 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 రోజుల పాటు పనిచేస్తుంది. దీని ధర 95 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 8,000. భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: భారత్​లో ఉత్తమ 5జీ స్మార్ట్​ ఫోన్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.