ETV Bharat / business

ఆన్​లైన్​ విక్రయాలు: ఇంటి నుంచే కార్లను కొనండి - ఆన్​లైన్​ విక్రయాలు

కరోనా నేపథ్యంలో స్తంభించిన వాహన విక్రయాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి ఆటోమొబైల్ సంస్థలు. ఇందుకోసం ఆన్​లైన్ ప్లాట్​ఫాంను ఎంచుకుంటున్నాయి. ఆన్​లైన్​లో వాహన విక్రయాలు ప్రారంభించినట్లు హోండా ఇండియా, బీఎండబ్లూ ఇండియా, ఫోక్స్ వ్యాగన్ ఇండియా, మెర్సిడెజ్ ఇండియా కంపెనీలు ప్రకటించాయి.

Honda launches online sales platform
ఆన్​లైన్​ విక్రయాలు: ఇంటి నుంచే కార్లను కొనెయ్యండి
author img

By

Published : Apr 28, 2020, 6:37 AM IST

కరోనా కట్టడికి ప్రస్తుతం దేశవ్యాప్త లాక్​డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా ఆటోమొబైల్ సంస్థల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే లాక్​డౌన్ ఉన్నా విక్రయాలు జరిపేందుకు ఆన్​లైన్​ వేదికను ఎంచుకుంటున్నాయి పలు సంస్థలు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు ఫోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్​ బెంజ్, హోండా వంటి సంస్థలు ఆన్​లైన్​లో అమ్మకాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి.

ఇంటి నుంచి బయటకు రాకుండా.. సురక్షితంగా ఇంట్లో నుంచే నచ్చిన మోడల్​ను ఆన్​లైన్​లో ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతున్నాయి ఈ సంస్థలు.

'హోండా ఫ్రం హోం'

ఆన్​లైన్​లో 'హోండా ఫ్రం హోం' పేరుతో కార్ల విక్రయాలు ప్రారంభించినట్లు హోండా ఇండియా తెలిపింది. వినియోగదారులు సులభంగా నచ్చిన కారును, తమకు అనువైన డీలర్​షిప్​ నుంచి కోనుగోలు చేసే విధంగా ప్లాట్​ఫాంను రూపొందించినట్లు పేర్కొంది.

ఫోక్స్ వ్యాగన్​ ..

ఆన్​లైన్​లో కారు కొనుగోలు చేసిన తర్వాత సురక్షితంగా వినియోగదారుడికి డెలివరీ అయ్యే వరకు సేల్స్​ కన్సల్టెంట్​లు వీడియో సంభాషణలో అందుబాటులో ఉంటారని ఫోక్స్ వ్యాగన్ ఇండియా తెలిపింది.

దేశవ్యాప్తంగా 137 సేల్స్, 116 సర్వీస్ టచ్​పాయింట్లను ఇంటిగ్రేట్ చేసినట్లు తెలిపింది. ఇందులో వినియోగదారులకు అనుకూలమైన డీలర్​షిప్ ద్వారా ఆన్​లైన్​లో నచ్చిన కారును కొనుగోలు చేయొచ్చని పేర్కొంది ఫోక్స్ వ్యాగన్​.

లగ్జరీ కార్లు ఆన్​లైన్​లో కొనొచ్చు..

ఆన్​లైన్ ద్వారానే కొత్త కార్లు, సెకండ్​ హ్యాండ్​ వాహనాలను ఆన్​లైన్​లో కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.

మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కూడా 'మెర్స్ ఫ్రం హోం' పేరుతో ఆన్​లైన్​ విక్రయాలను ప్రారంభించినట్లు ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.