ETV Bharat / business

హోమ్​లోన్‌ ఈఎంఐ సరిగా కడుతున్నారా? లేకుంటే..!

Home loan EMI payment problems: కొందరు అప్పులు చేసి సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. అయితే తేలిగ్గా గృహ రుణం తీసుకున్నా.. నిర్లక్ష్యం వల్లో.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానో సక్రమంగా ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారు. అటువంటివారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలంటే..?

Home loan EMI
Home loan EMI
author img

By

Published : Feb 19, 2022, 6:31 PM IST

Home loan EMI payment problems: కొత్త ఇల్లు కొన‌డం అనేది ఒక‌ప్పుడు చాలా మందికి జీవితకాల క‌ల‌. కానీ, ఇప్పుడు చిన్న వ‌య‌సులోనే బ్యాంకు రుణాలతో ఇల్లు సొంతం చేసుకుంటున్నారు చాలా మంది. ఈ రోజుల్లో బ్యాంకులు 6.55శాతం వ‌డ్డీ రేటు నుంచే గృహ రుణాలు అందజేస్తున్నాయి. అయితే, గృహ రుణం తీసుకోవ‌డం అనేది చాలా తేలిగ్గా అనిపించొచ్చు. దాన్ని సకాలంలో తిరిగి చెల్లించ‌డానికి తగిన ఆర్థిక ప్రణాళిక అవసరం. ఒకవేళ రుణం సక్రమంగా చెల్లించకపోతే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలి? పరిష్కారానికి ఏం చేయాలి?

ప్రభావం ఇలా..

ఇంటి రుణ ఈఎంఐ చెల్లింపుల‌ను త‌ర‌చూ ఆల‌స్యం చేసినా, కట్టకపోయినా రుణగ్రహీతలపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. ముందుగా క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది రుణ‌గ్రహీతల క్రెడిట్‌ యోగ్యతను దెబ్బతీస్తుంది. వారు భ‌విష్యత్‌లో కొత్త రుణాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోవచ్చు. గృహ రుణాన్ని ఏదైనా ఇత‌ర బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలకు బదిలీ చేయాలనుకుంటే.. పేలవమైన రీపేమెంట్‌ హీస్టరీ కారణంగా బ్యాంకులు ఈ దర‌ఖాస్తును తిర‌స్కరించొచ్చు. ఇటువంటి రుణ‌గ్రహీతలు వ్యక్తిగత, కారు రుణాలు వంటివి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఈఎంఐని ఆల‌స్యం చేస్తే నెలకు 1 నుంచి 2 శాతం వరకు బ్యాంకులు జరిమానా విధించొచ్చు. వ‌రుస‌గా 3 నెల‌ల ఈఎంఐలు తిరగి చెల్లించడంలో ఆల‌స్యం చేస్తే అది చిన్న డిఫాల్ట్‌గా ప‌రిగ‌ణిస్తారు. ఈ సంద‌ర్భంలో బ్యాంకు చెల్లింపుల కోసం రుణ గ్రహీతకు నోటీసులు పంపుతుంది. కానీ, ఈ ఆల‌స్యాన్ని ఇంకా పొడిగిస్తే స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. 3 నెల‌ల కంటే ఎక్కువ ఆల‌స్యం ప్రధాన డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. బ‌కాయిల‌ను రిక‌వ‌రీ చేయ‌డానికి బ్యాంకు రుణ గ్రహీత ఆస్తిని వేలం వేసే ప్రక్రియను ప్రారంభించొచ్చు.

పెద్ద డిఫాల్ట్‌కి పాల్పడినప్పుడు బ్యాంకు డిఫాల్టర్‌ రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా గుర్తించి, త‌ర్వాత రిక‌వ‌రీ విధానాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. సాధార‌ణంగా బ్యాంకులు రుణాన్ని ఎన్‌పీఏగా గుర్తించే ముందు నోటీసులు పంపుతాయి. కొన్ని సార్లు బ్యాంకులు తమ డబ్బు రికవరీ కోసం థ‌ర్డ్ పార్టీ ఏజెంట్లను నియమించుకుంటాయి. వారు రుణం గురించి రుణ‌గ్రహీత దగ్గరకు రావడం, ప్రశ్నించడం చేదు అనుభవాన్ని ఇస్తుంది. దీనికి తోడు అదే బ్యాంకు నుంచి ఏదైనా ఇతర రుణాలను సదరు రుణ గ్రహీత పొందినట్లయితే వాటిని కూడా ఎన్‌పీఏలుగా ట్యాగ్‌ చేసే అవకాశం ఉంటుంది.

ఇలా చేయొచ్చు..

Home loan EMI Solutions: ఆల‌స్య చెల్లింపును నివారించ‌డానికి తాత్కాలిక న‌గ‌దు స‌మ‌స్యను ఎదుర్కొన్నప్పుడు ఈఎంఐలను తిరిగి చెల్లించ‌డానికి రుణ‌గ్రహీత తన స్నేహితులు లేదా బంధువుల నుంచి డ‌బ్బు తీసుకోవ‌చ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉంటే వాటిని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. జీవిత బీమా పాల‌సీలు ఉన్నవారు బీమా ప‌ట్టాని పెట్టి రుణం తీసుకోవ‌చ్చు. పీఎఫ్ ఉన్న వారు సరిపడా మొత్తాన్ని పీఎఫ్ నుంచి ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. పీపీఎఫ్ వంటి దీర్ఘకాలిక పెట్టుబ‌డుల నుంచి కూడా న‌గ‌దుని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. కారు, బంగారం లాంటి ఆస్తుల‌ను అమ్మి కూడా ఈ డ‌బ్బుని గృహ‌రుణ ఈఎంఐ బకాయిలు తీర్చడానికి ఉపయోగించొచ్చు.

స్వల్ప కాలానికి మీ ఈఎంఐలను కవర్‌ చేయడానికి రుణ బీమా ప్లాన్‌ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహ‌రుణ పంపిణీ స‌మ‌యంలో ఈ రుణ బీమా ప‌థ‌కాల‌ను అందిస్తాయి. ఈఎంఐలను చెల్లించ‌లేన‌పుడు, ఉద్యోగం కోల్పోయినా లేదా తాత్కాలికంగా ఆదాయం కోల్పోయినా ఇది ఉప‌యోగంగా ఉంటుంది. అంతేకాకుండా, గృహ రుణాన్ని తీసుకున్నప్పుడు ఈఎంఐ త‌క్కువ ఉండ‌టానికి.. ఎక్కువ కాల పరిమితిని సెట్ చేసుకోవాలి. అయితే, కాల వ్యవధి పెరిగే కొద్దీ వ‌డ్డీ చెల్లింపు ఎక్కువ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

బ్యాంకులతో స్నేహంగా..

ఈఎంఐ చెల్లింపుల్లో సమస్యలు ఎదురైనప్పుడు రుణం ఇచ్చిన బ్యాంకుతో స్నేహ‌పూర్వకంగా ఉంటూ పరిష్కారం పొందడం కూడా మంచిది. కేసుపై ఆధార‌ప‌డి, బ్యాంకు రుణ భారాన్ని త‌గ్గించ‌డానికి నిబంధ‌న‌ల ప్రకారం వడ్డీ రేటు తగ్గించే అవకాశం రుణ పునరుద్ధరణ, గ్రేస్ లేదా మార‌టోరియం పీరియ‌డ్‌, లోన్ సెటిల్‌మెంట్ వంటి ఆప్షన్‌లను అందించి రుణ గ్రహీతకు సాయం చేయొచ్చు. తిరిగి చెల్లింపులు అసాధ్యం అనిపిస్తే ఆ ఇంటిని విక్రయించడం, మిగిలిన డబ్బుతో చిన్న ఇంటికి మారడం లాంటివీ చేయొచ్చు. అత్యవసరం అనిపిస్తే అద్దె ఇంటికి మారిపోవ‌చ్చు.

ఇదీ చూడండి: ఆర్థిక రాజధానే కాదు.. కోటీశ్వరులకు ఆవాసం కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.