ETV Bharat / business

Home Insurance: మీరూ.. గృహ బీమాకు అర్హులే! ఎందుకంటే..?

వర్షాకాలం వస్తే వానలతో పాటు వరదలు కూడా ముంచెత్తుతాయి. ఇళ్లు, ఇతర ఆస్తులకు నష్టం జరుగుతుంది. భారీ ఖర్చుతో నిర్మించుకునే ఇళ్లు ధ్వంసం అయితే రిపేరు కోసం ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీనిని తప్పించేందుకు బీమా పథకాలు(Home Insurance) ఉన్నాయి. ఈ బీమా ఏఏ విషయాల్లో వర్తిస్తుంది. దీనికి సంబంధించి ఇతర వివరాలు చూద్దాం.

author img

By

Published : Sep 5, 2021, 10:51 AM IST

home insurance
గృహ బీమా

సొంతిల్లు అనేది చాలా మందికి కల. అంతేకాకుండా దీర్ఘకాలంలో ఇది భారీ పెట్టుబడి కూడా. వరదల వల్ల చాలా ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. దీనివల్ల వాటితో పాటు ఇంటిలోని సామగ్రికి కూడా నష్టం సంభవిస్తోంది. కొన్ని ఇళ్లు అయితే పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరదలు పెరిగిపోయాయి. భవిష్యత్తులో వరదలు ఇంకా పెరగొచ్చేనే అంచనాలు ఉన్నాయి.

ఇంటికి, ఇంటిలోని సామగ్రికి సాధారణంగా ఎక్కువ మొత్తం వెచ్చిస్తుంటాం. వీటికి నష్టం జరగటం వల్ల పునరుద్ధరణకు భారీగా ఆర్థిక భారం పడుతుంది. ఆర్థికంగా కష్టనష్టాలకు ఓర్చి కట్టుకున్న ఇంటి రిపేరుకు మళ్లీ జేబు చిల్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా వరదల వల్ల జరిగిన నష్టాన్ని భరించేందుకు గృహ బీమా(Home Insurance) తీసుకోవచ్చు.

బీమా ఇలా..

గృహ బీమాలు (Home Insurance India) సాధారణంగా ఒక్క ప్రీమియం పాలసీలే. కేవలం ఇంటికే కాకుండా.. ఇంటిలోని ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు తదితర సామాగ్రికి కూడా బీమా చేయించుకోవచ్చు. బీమా ఉన్నట్లయితే.. అగ్ని ప్రమాదాలు, తుపాను, వరదలు తదితరాల జరిగినప్పుడు ఇంటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చును బీమా కంపెనీలు భరిస్తాయి. దోపిడీలు జరిగిన సందర్భంలో కూడా బీమా వర్తించేలా పాలసీ తీసుకోవచ్చు.

కేవలం సహాయ వైపరీత్యాల సందర్భంలోనే కాకుండా మానవ కల్పిత చర్యల వల్ల జరిగిన సందర్భంలో వర్తించేలా పాలసీ ఉంటుంది. చిన్న సంఘటనల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద ప్రకృతి వైపరీత్యాలకు బీమా తీసుకోవచ్చు. గాలి, తుపాను వల్ల పైకప్పు ఎగిరిపోవటం, తీవ్ర వర్షాల వల్ల పైకప్పు నుంచి లీక్‌ అవటం, వరదలు, అగ్ని ప్రమాదం తదితరాలకు బీమా వర్తిస్తుంది.

ఆన్​లైన్ ద్వారా గృహ బీమా పాలసీ తీసుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులు ఈ బీమా అందిస్తున్నాయి. వివిధ బీమా సంస్థలు గృహ బీమాను వివిధ రకాల ప్రయోజనాలతో అందిస్తున్నాయి. ఇందులో వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అవసరానికి సరిపడే పాలసీని ఎంచుకోవచ్చు.

రకాలు..

గృహ బీమాలో వివిధ రకాలు ఉన్నాయి. ఇంటితో పాటు ఇంటిలోని వస్తువులపై బీమా కల్పించే విధంగా సమగ్ర పాలసీ ఉంటుంది. ఇందులో.. నగలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఇతర పరికరాలు, వ్యక్తిగత సామాగ్రి, ఫర్నీచర్‌, ఇతర విలువైన వస్తువులకూ బీమా అందుతుంది. హౌజ్ హోల్డ్ ఆర్టికల్స్ బీమా తీసుకుంటే.. పరికరాలు, ఫర్నీచర్‌, నగలు, బీరువాలు తదితర అవసరమైన వస్తువుల విషయంలో కవరేజీ లభిస్తుంది.

గృహ బీమా విషయంలో ప్రీమియం సాధారణంగా అందుబాటు ధరల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటికీ, ఇంట్లోని వస్తువులకూ కలిపి రూ.లక్ష బీమా పాలసీ తీసుకుంటే.. ఏడాదికి ప్రీమియం రూ.50-100కు మించదని వారు అంటున్నారు. టీవీ, ఫ్రిజ్‌, ఎల్‌ఈడీ టీవీ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు కలిపి రూ.లక్ష వరకూ పాలసీ తీసుకుంటే.. రూ.1,100 వరకు ప్రీమియం ఉంటుందని వారు చెబుతున్నారు. అన్ని సెక్షన్లనూ కలిపి తీసుకున్నా.. రూ.లక్షకు ప్రీమియం రూ.2,000 ఉంటుందని వారు అంటున్నారు.

అపార్ట్‌మెంట్‌, ఇళ్లకు కవరేజీ ఇచ్చేందుకు ప్రత్యేకించి పాలసీలు ఉన్నాయి. కార్యాలయాలు, దుకాణాల కోసం ప్రత్యేక పాలసీలు ఉన్నాయి. వీటితో పాటు ఇతర రకాల పాలసీలు ఉన్నాయి. గృహ బీమాతో పాటు యాడ్ ఆన్ లను కంపెనీలు అందుబాటులో ఉంచాయి. అద్దె నష్టపోవటం, తాత్కాలిక నివాసం, పెంపుడు జంతువులు తదితరాలకు బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు.

కవరేజీ వేటికి?

కొన్ని సంఘటనల విషయంలో సాధారణంగా బీమా వర్తించదు. యుద్ధం, అణు యుద్ధం లాంటివి ఈ కోవలేకే వస్తాయి. నిరక్ష్యం ఉన్నట్లయితే కూడా కవరేజీ లభించకపోవచ్చు. నిర్మాణంలో ఉన్న ఇంటికి కవరేజీ ఉండదు. నిబంధనలు ప్రత్యేకంగా ఉన్నట్లయితే మాత్రమే విలువైన నగలు, సున్నితమైన డాక్యుమెంట్లు, డబ్బులకు బీమా వర్తిస్తుంది.

సాధారణంగా అయితే ప్రకృతి వైపరీత్యాలకు కవరేజీ ఉంటుంది. అగ్నిప్రమాదం, పిడుగులు, తుపాను, వరదలు, గాలి దుమారం, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, విమానాలు, మిస్సైల్స్ , ఉగ్రదాడుల్లో ఇల్లు దెబ్బతినటం వంటివి ఇందులోకి వస్తాయి.

ఇది గమనించండి..

గృహాన్ని ఎక్కువ మొత్తంతో నిర్మించుకుంటాం.. కాబట్టి సరైన మొత్తంలో బీమా తీసుకోవాలి. లేని పక్షంలో జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉంటుంది. గృహ బీమా(Home Insurance).. యజమాని మాత్రమే తీసుకోవచ్చు.

బీమా తీసుకునే సమయంలో కొన్ని సంఘటనలకు తప్పకుండా కవరేజీ ఉండే విధంగా చూసుకోవాలి. అన్ని ప్రమాదాల్లో బీమా కల్పించే విధంగా సమగ్ర పాలసీని ఎంచుకోవచ్చు. తరచూ సంభవించే ప్రకృతి వైపరీత్యాల విషయంలో మాత్రం కవరేజీ తప్పకుండా ఉండాలి. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో, తాత్కాలిక నివాసం ఖర్చు తదితరాల గురించి తెలుసుకోవాలి.

ఇదీ చదవండి: నెల‌కు రూ.9వేలతో ప్రారంభించి.. 15 ఏళ్ల‌లో రూ.కోటి.. ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.