ETV Bharat / business

హోండా నుంచి కొత్త బైక్‌.. ధర, ప్రత్యేకతలివే..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా నుంచి కొత్త బైక్ వచ్చింది. సీబీ200ఎక్స్​ పేరుతో కొత్త మోడల్​ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరి ఆ బైక్ ధర, ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

honda bike
హోండా బైక్
author img

By

Published : Aug 20, 2021, 6:04 AM IST

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. సీబీ200ఎక్స్(CB200X) పేరిట కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.44 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, గురుగ్రామ్‌) నిర్ణయించింది. రోజువారీ అవసరాలతో పాటు ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌కు అనుగుణంగా ఈ బైక్‌ను హోండా తీర్చిదిద్దింది. హీరో ఎక్స్‌పల్స్‌ 200కు పోటీగా ఈ బైక్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

CB 200X
బైక్ ముందుభాగం

మారుతున్న పట్టణ యువత జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని వారికి అత్యుత్తమ రైడింగ్‌ అనుభూతిని అందించే ఉద్దేశంతో CB200Xను తీర్చిదిద్దినట్లు హోండా మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రెసిడెంట్‌, సీఈవో అత్సుషి ఒగాటా బైక్‌ విడుదల సందర్భంగా పేర్కొన్నారు. ఈ బైక్‌ రోజువారీ అవసరాలు తీర్చడంతోపాటు వారాంతపు ప్రయాణాలకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.

CB 200X
సీబీ200ఎక్స్

ఇక ప్రత్యేకతల విషయానికొస్తే.. బీఎస్‌-6 ప్రమాణాలతో 184 సీసీ ఇంజిన్‌తో ఈ బైక్‌ వస్తోంది. ఇది 8,500 ఆర్‌పీఎం వద్ద 17 బీహెచ్‌పీని, 6000 ఆర్‌పీఎం వద్ద 16.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను అమర్చారు. గతంలో వచ్చిన హార్నెట్‌ 2.0లోనూ ఇదే ఇంజిన్‌ ఉంది. సీబీ200 ఎక్స్(CB200X)లో ఎల్‌ఈడీ లైట్‌ సెటప్‌, పూర్తి డిజిటల్‌ లిక్విడ్‌ క్రిస్టల్‌ మీటర్‌, స్ప్లిట్‌ సీట్‌, సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌, ముందూ వెనుక డిస్క్‌ బ్రేకులను అందిస్తున్నారు. ఈ బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి డెలివరీలు మొదలు కానున్నాయని కంపెనీ డైరెక్టర్‌ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా తెలిపారు.

ఇదీ చదవండి:సింపుల్​ వన్​ ఈ-స్కూటర్ అదుర్స్​- ఓలాకు దీటుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.