దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నియామకాలు కూడా నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. జూన్‌తో పోలిస్తే.. జులైలో ఉద్యోగ నియామకాలు దేశవ్యాప్తంగా స్వల్పంగా 5 శాతం పెరిగినట్లు ప్రముఖ జాబ్ పోర్టల్ నౌక్రీ డాట్‌కామ్ సర్వేలో తేలింది.
అయితే గత ఏడాది జులైతో పోలిస్తే 2020 ఏడో నెలలో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గినట్లు సర్వే పేర్కొంది.
సర్వేలోని ముఖ్యాంశాలు..
- హోటళ్లు, రెస్టారెంట్లు, విమాన రంగం, పర్యటకం, రిటైల్, రియల్ ఎస్టేట్, ఆయిల్ & గ్యాస్, విద్యుత్ రంగాల్లో జులైలో (2019 జులైలో పోలిస్తే) నియామకాలు భారీగా తగ్గాయి
- బీపీఓ/ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ హార్డ్‌వేర్, హెల్త్‌కేర్, మీడియా, వినోదం, నిర్మాణ రంగాల నియామకాల్లో క్షీణత తక్కువగా ఉంది.
- దేశవ్యాప్తంగా జులైలో (2019 జులైతో పోలిస్తే) ఉద్యోగ నియమాకాలు దాదాపు 47 శాతం తగ్గాయి. మెట్రో నగరాల్లో.. జాతీయ సగటైన 47 శాతం కన్నా కాస్త ఎక్కువగా 50 శాతం క్షీణించాయి.
- చెన్నై, ముంబయి, బెంగళూరు నగరాల్లో నియమాకాల తగ్గుదల ఎక్కువగా ఉంది. ఛండీగఢ్, జైపుర్, కొచ్చి పట్టణాల్లో నియామకాలు స్వల్పంగా తగ్గాయి.
ఇదీ చూడండి:గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు