ETV Bharat / business

మార్చిలో నియామకాలు పుంజుకున్నాయ్​ - నౌక్రీ నియామకాల సర్వ

మార్చిలో ఉద్యోగ నియామకాలు 3 శాతం పెరిగినట్లు నౌకరీ డాట్​కామ్ నెలవారీ నివేదిక వెల్లడించింది. ఐటీ-సాఫ్ట్​వేర్​, రిటైల్​ రంగాలు ఇందుకు దోహదం చేసినట్లు తెలిపింది.

jobs rise in March
పెరిగిన ఉద్యోగ నియామకాలు
author img

By

Published : Apr 9, 2021, 10:58 AM IST

మార్చిలో నియామకాలు స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరిలో 2,356 నియామక ప్రకటలు రాగా.. మార్చిలో ఆ సంఖ్య 2,436కు పెరిగిందిని.. నౌకరీ జాబ్​స్పీక్​ సూచీ తెలిపింది. మార్చిలో 3 శాతం ఉద్యోగాలు పెరగటానికి ఐటీ-సాఫ్ట్​వేర్​, రిటైల్​ రంగాలు దోహదపడ్డాయి. కంపెనీలు డిజిటల్​కు మారుతున్నందున ఐటీ-సాఫ్ట్​వేర్​ రంగంలో నియామకాలు మార్చిలో 11 శాతం వృద్ధి చెందాయి. రిటైల్​ రంగంలోనూ అదే స్థాయిలో నియామకాలు పెరిగాయి. నౌకరీ డాట్​కామ్​ వెబ్​సైట్​పై నెలవారీగా నమోదయ్యే ఉద్యోగాల ఆధారంగా నౌకరీ జాబ్​స్పీక్​ సూచీని లెక్కిస్తారు.

మార్చిలో నియామకాలు ఇలా..

  • బీపీఓ/ఐటీఈఎస్, బీఎఫ్​ఎస్​ఐ 1 శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి. కొవిడ్​-19 రెండో దఫాలో విద్య/శిక్షణ 13 శాతం, ఎఫ్​ఎంసీజీ 10 శాతం, హోటళ్లు/విమానయానం/పర్యటకం 8 శాతం చొప్పున క్షీణతను చవిచూశాయి.
  • ఆరు మెట్రో నగరాలు, కీలక ద్వితీయ శ్రేణి నగరాల్లో నియామకాలు పెరిగాయి. కోల్​కతా 3 శాతం, వడోదరా 2 శాతం చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి. అహ్మదాబాద్​లో 13 శాతం వృద్ధి లభించింది.
  • మార్కెటింగ్/ప్రకటనల్లో నిపుణులకు 8 శాతం చొప్పున గిరాకీ కనిపించింది. అమ్మకాల నిపుణులకు గిరాకీ 6 శాతం తగ్గింది.
  • 4-7 ఏళ్లు, 8-12 ఏళ్లు అనుభవం కలిగిన వృత్తి నిపుణుల నియామకాలు 6 శాతం పెరిగాయి. 16 ఏళ్లకుపైగా అనుభవం కలగిన నాయకుల నియామకాలు 3 శాతం తగ్గాయి.

ఇదీ చదవండి:పాస్​వర్డ్​ సేవ్​ చేయకుండా 'బ్రౌజర్​' నియంత్రణ ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.