ETV Bharat / business

హిందుజా గ్రూపులో లుకలుకలు... విభజన తప్పదా?

పుడుతూ అన్నదమ్ములు.. పెరుగుతూ దాయాదులు అన్నారు పెద్దలు. ఎంత గొప్పవారైనా ఏదో ఒక సమయంలో ఆస్తులు పంచుకోక తప్పదు. ఇప్పుడు అలాంటి కథే ఒకటి తెరమీదకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోన్న హిందుజా గ్రూపూలో ఇప్పుడు ఆస్తుల పంపకంపై కుటుంబ వివాదం నెలకొంది.

HINDUJA GROUP BROTHERS
హిందుజా గ్రూపులో లుకలుకలు... విభజన తప్పదా?
author img

By

Published : Jun 26, 2020, 6:50 AM IST

లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. 38 దేశాల్లో విస్తరించిన అనేక కంపెనీలు.. బ్యాంకు, ట్రక్కులు, లూబ్రికెంట్‌ తయారీ సంస్థలు.. ఇలా అనేక రంగాల్లో దూసుకెళ్తున్న గ్రూపు.. ఇప్పుడు లండన్‌ కోర్టులో న్యాయ వివాదంలో చిక్కుకుంది.. అదే హిందుజా గ్రూపు.. ఆ కుటుంబ సభ్యుల మధ్య ఇప్పుడు లుకలుకలు.. విభజన దిశగా సంస్థ అడుగులు..

HINDUJA GROUP GOPICHAND
గోపీచంద్​

ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

శ్రీచంద్‌, గోపీచంద్‌, ప్రకాశ్‌, అశోక్‌.. ఈ నలుగురు అన్నదమ్ములు. హిందుజా గ్రూపు కంపెనీలకు వీరే అధిపతులు. వీరంతా కలిసి 2014లో ఒక దస్త్రంపై సంతకాలు చేశారు. అందులో ఏముందంటే.. ఏ సోదరుడి దగ్గర ఉన్న ఆస్తులైనా మిగిలిన అందరికీ చెందుతాయి. అంతే కాదు.. ప్రతి ఒక్కరూ మిగతా వారిని తమ కార్యనిర్వాహకులుగా నియమించుకొనే వెసులుబాటు ఉండేలా అందులో రాసుకున్నారు. అయితే కుటుంబ పెద్ద అయిన శ్రీచంద్‌ హిందుజా కుమార్తెల్లో ఒకరైన వినూ తాజాగా ఆ దస్త్రం న్యాయ పరంగా చెల్లదని, 2016 నుంచి తాను అడుగుతున్నట్లు కుటుంబ ఆస్తుల్ని విభజించమని కోరుతున్నారు. ఇప్పుడు ఈ వివాదం లండన్‌ కోర్టులో ఉంది.

HINDUJA GROUP PRAKASH
ప్రకాశ్​

సమస్య ఎక్కడొచ్చింది?

శ్రీచంద్‌ ఒక్కడి పేరు మీదున్న హిందుజా బ్యాంక్‌పై నియంత్రణ కోసం మిగతా సోదరులు గోపీచంద్‌, ప్రకాశ్‌, అశోక్‌ 2014 దస్త్రాన్ని వినియోగించుకోవాలని చూడటం వల్ల న్యాయ వివాదం మొదలైంది. వినూ, శ్రీచంద్‌ తాజాగా ఆ దస్త్రానికి న్యాయపరమైన ఆమోదం లేదని, అది కేవలం కుటుంబ సభ్యులు రాసుకున్నదే అని, దాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. హిందుజా బ్యాంక్‌కు ప్రస్తుతం శ్రీచంద్‌ మరో కుమార్తె శానూ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఆమె కుమారుడు కరమ్‌ను గత వారం సీఈఓగా నియమించడం వల్ల వివాదం రాజుకుంది.

HINDUJA GROUP SRICHAND
శ్రీచంద్​

వందేళ్ల చరిత్ర..

హిందుజా కంపెనీని 1914లో పరమానంద్‌ దీప్‌చంద్‌ హిందుజా ఏర్పాటు చేశారు. ఈయన తొలుత కరాచీ, ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించేవారు. 1919లో తొలి విదేశీ కార్యాలయాన్ని ఇరాన్‌లో స్థాపించారు. 1979 వరకు అక్కడే ప్రధాన కార్యాలయం కొనసాగింది. ఇస్లామిక్‌ తిరుగుబాటు తర్వాత ఐరోపాకు మకాం మార్చారు. ఆయన కుమారులు శ్రీచంద్‌, గోపీచంద్‌ 1979లో లండన్‌కు కార్యాలయాన్ని మార్చి, ఎగుమతుల వ్యాపారాన్ని బలోపేతం చేశారు. ప్రకాశ్‌ జెనీవాలో ఉంటూ గ్రూపు ఆర్థిక వ్యవహారాల్ని నిర్వహించేవారు. అశోక్‌ భారత్‌లో ఉంటూ ఇక్కడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా 2017లో శ్రీచంద్‌, గోపీచంద్‌ నిలిచారు. సుమారు 16.2 బిలియన్‌ పౌండ్ల (రూ.1.5 లక్షల కోట్లు) సంపదతో వారు సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌ 2017లో స్థానం సంపాదించారు.

HINDUJA GROUP ASHOK
అశోక్​

వారసులు వీరే..

  1. శ్రీచంద్‌కు (84) ఇద్దరు కుమార్తెలు - వినూ, శానూ
  2. గోపీచంద్‌కు (79) ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె - సంజయ్‌, ధీరజ్‌, రీటా
  3. ప్రకాశ్‌కు (75) ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె- అజయ్‌, రామకృష్ణన్‌, రేణుక
  4. అశోక్‌కు (69) ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు - అంబిక, సత్య, శోమ్‌

ఇదీ చదవండి: ఫెయిర్ అండ్​ లవ్​లీలో ఇక 'ఫెయిర్​' మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.