ETV Bharat / business

'రోజుకు సగటున 33 కి.మీ. మేర రహదారుల నిర్మాణం' - జాతీయ రహదారులు

జాతీయ రహదారుల నిర్మాణంలో సరికొత్త మైలురాయిని చేరినట్లు పేర్కొన్నారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. రోజుకు సగటున 33 కి.మీ. మేర రహదారులను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఫాస్టాగ్​ విధానం వల్ల.. ఏటా రూ. 20 కోట్ల ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు.

Highways construction touches record 33 km a day: Gadkari
'రోజుకు సగటున 33 కి.మీ. మేర రహదారుల నిర్మాణం'
author img

By

Published : Mar 1, 2021, 9:23 PM IST

దేశవ్యాప్తంగా రోజుకు 30 కిలోమీటర్ల మేర రహదారుల్ని నిర్మించి కొత్త ఘనతని సాధించామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో.. మొత్తం 11 వేల 35 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని ఆయన పేర్కొన్నారు. అంటే రోజుకు సగటున 32.85 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఈ రికార్డును సాధించామన్నారు. మార్చి 31 కల్లా ఈ వేగాన్ని 40 కిలోమీటర్లకు చేరుకుంటామని గడ్కరీ పేర్కొన్నారు.

''ఈ ఆర్థిక సంతవ్సరం ఇప్పటివరకు 11 వేల 35 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించాం. అంటే రోజుకు సగటున 32.85 కి.మీ. నిర్మాణం జరిగింది. ఇదో కొత్త రికార్డు.''

- నితిన్​ గడ్కరీ, కేంద్ర మంత్రి

భారతమాల ప్రాజెక్టు కింద దాదాపు 5.35 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో.. 34 వేల 800 కిలోమీటర్ల మేర హైవేలను నిర్మిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి.

ఫాస్టాగ్​తో ఏటా రూ. 20 వేల కోట్ల ఇంధనం ఆదా..

కేంద్రం ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ విధానం వల్ల.. ప్రతి ఏడాది 20వేల కోట్ల విలువ గల ఇంధనం ఆదా అవుతుందని నితిన్‌ గడ్కరీ అన్నారు. టోల్‌ ప్లాజాల వద్ద డిజిటల్‌ చెల్లింపులు తీసుకురావడం వల్ల.. వాహనాదారుల సమయం, ఇంధన వృధాను నివారించినట్లు చెప్పారు.

టోల్ ప్లాజాల ద‌గ్గర పరిస్థితులు.. ట్రాఫిక్ క్యూను లైవ్‌లో చూసే మానిట‌రింగ్ వ్యవ‌స్థను సోమ‌వారం గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి.. ఈ కొత్త వ్యవస్థను అమ‌లు చేయ‌డం ద్వారా కేంద్రానికి అద‌నంగా 10 వేల కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఫాస్టాగ్‌ వల్ల.. వాహనాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు కూడా భారీగా తగ్గినట్లు గడ్కరీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఐదో నెలలోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.