ETV Bharat / business

రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమీక్ష హైలైట్స్ - ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు

Highlights Of RBI Monetary Policy: ఆర్థిక నిపుణుల అంచనాలు నిజం చేస్తూ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది రిజర్వు బ్యాంక్. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి బుధవారం వరకు జరిగిన సమీక్షలో ఆర్​బీఐ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ఇలా ఉన్నాయి.

Highlights Of RBI Monetary Policy
ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు
author img

By

Published : Dec 8, 2021, 4:27 PM IST

Highlights Of RBI Monetary Policy: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఆర్​బీఐ ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ). బుధవారం ఈ మేరకు ప్రకటన చేసింది. రివర్స్ రెపోరేటు (3.35 శాతం)లోనూ మార్పు లేదని స్పష్టం చేసింది.

ఎంపీసీ సమీక్ష హైలైట్స్..

  • వరుసగా 9వ సారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం.
  • రెపోరేటును 4 శాతంగా, రివర్స్​ రెపో రేటును 3.35 శాతంగా ఉంచుతున్నట్లు ప్రకటన.
  • మార్జినల్​ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్​ 4.25 శాతంగా కొనసాగింపు.
  • ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 9.5శాతంగా ఉంటుందని అంచనా.
  • మూడో త్రైమాసికంలో 6.6గా, నాలుగో త్రైమాసికంలో 6గా వృద్ధిరేటు అంచనా.
  • వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 17.2శాతంగా అంచనా.
  • భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నట్లు వెల్లడించిన ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​.
  • ఈ ఏడాది ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంటుందన్న శక్తికాంత్​ దాస్​.
  • పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై తగ్గిన పన్నులతో వినిమయ గిరాకీ పుంజుకుంటుందన్న ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​.
  • విదేశీ శాఖల్లో మూలధనాన్ని నింపడానికి, లాభాలను స్వదేశానికి రప్పించడానికి బ్యాంకులకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న ఆర్​బీఐ గవర్నర్​.
  • డిజిటల్ చెల్లింపుల కోసం వినియోగదారులపై విధించే ఛార్జీలను సమీక్షించాలని ప్రతిపాదించిన ఆర్​బీఐ.
  • యూపీఐ పేమెంట్స్​ను పెంచే దిశగా చర్యలు.
  • ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరగనున్న తదుపరి ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశం.

ఇవీ చూడండి:

కీలక వడ్డీ రేట్లు యథాతథం.. రిజర్వు బ్యాంకు ప్రకటన

'2021-22లో భారత వృద్ధి రేటు 8.4 శాతం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.