ETV Bharat / business

నాగార్జున ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌కు హైకోర్టులో ఊరట - హైకోర్టు వార్తలు

రుణ వసూళ్ల ప్రక్రియ వ్యవహారంలో నాగార్జున ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కంపెనీతో పాటు డైరెక్టర్లు, వాటాదారులు, హామీదారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదంటూ బ్యాంకులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నాగార్జున ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌కు హైకోర్టులో ఊరట

author img

By

Published : May 14, 2021, 3:09 AM IST

రుణ వసూళ్ల ప్రక్రియ వ్యవహారంలో నాగార్జున ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కంపెనీతో పాటు డైరెక్టర్లు, వాటాదారులు, హామీదారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదంటూ బ్యాంకులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1675 కోట్ల రుణబకాయిలపై తాము సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఆమోదించిన రుణదాతల కమిటీ తిరిగి దాన్ని తిరస్కరిస్తూ దివాలా ప్రక్రియ నిమిత్తం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడం సబబేనంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నాగార్జున ఫర్టిలైజర్స్‌ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ టి.శ్రీదేవి, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

తామిచ్చిన రుణ పరిష్కార ప్రతిపాదనను ఉమ్మడి రుణదాతల కమిటీ 2020 మార్చిలో ఆమోదించిందని, ఆ తర్వాత దానికి విరుద్థంగా ఎన్‌సీఎల్‌టీలో దివాలా పరిష్కార చర్యలు చేపట్టిందని కంపెనీ తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రకాష్‌ రెడ్డి వాదించారు. దీంతో హైకోర్టు ప్రతివాదులైన పలు బ్యాంకులకు, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేసింది. ఈలోగా కఠిన చర్యలు తీసుకోవద్దని బ్యాంకులను ఆదేశించింది.

ఇదీ చదవండి: చికిత్స కోసం వచ్చే ఇతర రాష్ట్రాల రోగులకు మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.