ETV Bharat / business

చిత్తూరులో దుమ్మురేపిన 'హీరో'- వందల బైక్​లతో గిన్నిస్ రికార్డ్ - స్ల్పెండర్​ ప్లస్​ బైకులతో హీరో అతిపెద్ద లోగో

అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా పేరున్న హీరో మోటోకార్ప్ మరో రికార్డు సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లోగోను ఆవిష్కరించి గిన్నిస్​ రికార్డును దక్కించుకుంది. ఈ ఘనతకు ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు వేదికైంది. ఆ రికార్డు వివరాలు ఇలా ఉన్నాయి.

Hero Huge Logo
హీరో భారీ సైజు లోగో
author img

By

Published : Aug 11, 2021, 1:58 PM IST

Updated : Aug 11, 2021, 7:34 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్​' మరో అరుదైన ఘనతను సాధించింది. కంపెనీకి చెందిన బైక్​లతో అత్యంత భారీ సైజు లోగోను ఆవిష్కరించి 'గిన్నిస్​' రికార్డు సొంతం చేసుకుంది.

ఒకప్పుడు కలిసి ద్విచక్ర వాహనాలు తయారు చేసిన హోండా నుంచి విడిపోయి.. ఒంటరిగా కార్యకలాపాలు ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రికార్డు వివరాలు ఇలా..

హీరోలో అత్యధికంగా అమ్ముడయ్యే స్ల్పెండర్​ ప్లస్​ బైక్​లను ఉపయోగించి ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లాలో ఉన్న కంపెనీ తయారీ యూనిట్​లో 1000 అడుగులు x 800 అడుగుల ఖాళీ స్థలంలో.. 1,845 బ్లాక్​ కలర్ స్ల్పెండర్ ప్లస్ బైక్​లను ఒకదాని పక్కన మరొకటి నిలిపి.. ఈ భారీ లోగోను రూపొందించింది.

స్థలాన్ని చదును చేసేందుకు, లోగో ప్రణాళికలు రూపొందించేందుకు 90 రోజుల సమయం పట్టింది. మొత్తం 100 మంది సిబ్బంది, నిపుణులు 300 గంటలు శ్రమించి దీనిని సాధ్యం చేశారు.

  • What happens when 100 brilliant minds come together? A world record is made. With 90 days of planning and 300 hours of dedication.
    Watch the video to know more. pic.twitter.com/QAdK4CijUO

    — Hero MotoCorp (@HeroMotoCorp) August 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: 2020-21 వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్​ఓ క్లారిటీ!

Last Updated : Aug 11, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.