ETV Bharat / business

హృద్రోగ ఔషధాలకు అనూహ్య గిరాకీ - మెడిసన్​ సేల్స్​

కొవిడ్​-19 వ్యాప్తి కారణంగా ఔషధాలకు అనూహ్య గిరాకీ లభిస్తోంది. గత పది నెలలుగా పారాసెట్మాల్​, అజిత్రోమైసిన్​, విటమిన్​ మాత్రలు సహా.. యాంటీ-బయోటిక్​ మందుల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇక కరోనాకు విరుగుడుగా ఇటీవల వచ్చిన ఫావిపిరవిర్​, రెమ్​డెసివిర్​లకూ మంచి స్పందనే వచ్చింది. అయితే.. క్యాన్సర్​ వంటి కొన్ని ఔషధాల వినియోగం క్షీణించగా.. హృద్రోగ విభాగానికి చెందిన మందులు మాత్రం గణనీయమైన వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

HEAVY DEMAND FOR CARDIOVASCULAR DRUGS
హృద్రోగ ఔషధాలకు అనూహ్య గిరాకీ
author img

By

Published : Dec 26, 2020, 7:34 AM IST

దాదాపు గత పది నెలలుగా కరోనా వైరస్‌ వ్యాధి(కొవిడ్‌-19) విస్తరణ ఫలితంగా మందుల వినియోగంలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాధి పీడితులు తప్పనిసరిగా వాడాల్సిన పారాసెట్మాల్‌, అజిత్రోమైసిన్‌, విటమిన్‌ ట్యాబ్లెట్లు, కొన్ని యాంటీ-బయాటిక్‌ ఔషధాల అమ్మకాలు బాగా పెరిగాయి. అదే సమయంలో ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కరోనా వైరస్‌ వ్యాధిని అదుపు చేయడానికి వీలైన 'ఫావిపిరవిర్‌' ఔషధం ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి రావడం వల్ల.. ఆ ఔషధ అమ్మకాలు పెద్దఎత్తున నమోదయ్యాయి. ఆ తర్వాత 'రెమ్‌డెసివిర్‌' ఐవీ-ఫ్లూయిడ్‌ ఇంజక్షన్‌ మార్కెట్లోకి వచ్చింది.

ఇలా కరోనా వైరస్‌ వ్యాధికి సంబంధించిన ఔషధాల వినియోగం గణనీయంగా పెరగ్గా.. మిగిలిన విభాగాల ఔషధాల విక్రయాలు పెద్దగా పెరగలేదు. ముఖ్యంగా కాన్సర్‌ వంటి కొన్ని ఔషధాల అమ్మకాల్లో బాగా క్షీణత చోటుచేసుకుంది. కాన్సర్‌ రోగులకు ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే ప్రమాదం ఉన్నందున, తప్పనిసరైతేనే ఆసుపత్రికి రమ్మని వైద్యులే సూచించడమూ ఒక కారణం. కానీ హృద్రోగ విభాగానికి చెందిన ఔషధాల అమ్మకాల్లో మాత్రం వృద్ధి చోటుచేసుకుంటోంది! ఈ ఏడాది జులై నుంచి హృద్రోగ ఔషధాల అమ్మకాలు గణనీయంగా నమోదవుతున్నాయి. ఔషధ రంగ సగటు వార్షిక వృద్ధి కంటే, హృద్రోగ ఔషధాల అమ్మకాల్లో వృద్ధి అధికంగా ఉండటం గమనార్హం.

  • జనాభాకు తోడు వృద్ధుల జనాభా అధికమవుతుండటం, జీవనశైలిలో మార్పుల వల్ల గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య మనదేశంలో అధికంగా ఉంటోందని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) అంచనాల ప్రకారం 2030 నాటికి 35 శాతం మరణాలకు గుండె జబ్బులే కారణమవుతాయి. 2016లో ఇది 25 శాతం మాత్రమే. అందుకే ఇటీవల కాలంలో హృద్రోగ విభాగానికి చెందిన మందుల అమ్మకాలు అధికంగా నమోదవుతున్నాయి.

ఈ కంపెనీలకు భారీ అవకాశాలు

  • హృద్రోగ ఔషధాల తయారీలో అయిదు దేశీయ కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. అవి: సన్‌ ఫార్మాసూటికల్‌ ఇండస్ట్రీస్‌, సిప్లా, గ్లెన్‌మార్క్‌, లుపిన్‌, టోరెంట్‌ ఫార్మా.
  • వచ్చే పది, ఇరవై ఏళ్లలో గుండె జబ్బుల ముప్పు ఇంకా పెరుగుతుందని, తత్ఫలితంగా ఈ విభాగానికి చెందిన మందులు తయారు చేసే కంపెనీలకు వృద్ధి అవకాశాలు అధికంగా ఉంటాయని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మధుమేహం, రక్తపోటు నుంచి

మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు కాలక్రమంలో గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి. మనదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎంతో అధికమనేది తెలిసిన విషయమే. కొవిడ్‌ వ్యాధిగ్రస్తులకూ మధుమేహం వస్తోంది. ఈ ఏడాది జులైలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం మనదేశంలో తీవ్రమైన మధుమేహంతో 8 కోట్ల మంది, అధిక రక్తపోటుతో 20 కోట్ల మంది బాధపడుతున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకోనందున ఇంకా ఎంతో మందికి తమకు మధుమేహం/అధిక రక్తపోటు ఉన్నట్లు కూడా తెలీదు. ఈ పరిస్థితులే ఎక్కువ మంది గుండెజబ్బుల బారిన పడేందుకు తావిస్తున్నాయి. ముందుముందు మనదేశంలో మరణాలకు గుండె జబ్బు ప్రధాన కారణం అవుతుందని అగ్రశ్రేణి ఫార్మా సంస్థ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. జన్యు కారణాలతో పాటు జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో హృద్రోగ ఔషధాలకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుందనేది నిస్సందేహం.

వీటి వాడకం పెరుగుతోంది

కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటును తగ్గించే మందులతో పాటు గుండె పోటు, గుండె వైఫల్యాలను నివారించే ఔషధాల వినియోగం అధికం అవుతుందని స్పష్టమవుతోంది. గుండె జబ్బుల నివారణ, అదుపు చేయడానికి సింథటిక్‌ ఔషధాలతో పాటు బయో ఔషధాలు, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: ఐఎంజీ-ఆర్‌లో 50% వాటా కొనుగోలు: ఆర్‌ఐఎల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.