ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తన ఖాతాదారుల ఎన్ఎస్సీ(జాతీయ స్టాక్ ఎక్సేంజ్) ట్రేడింగ్‌ను కొంత సమయం పాటు నిలిపి వేసింది. కొన్ని అనుకోని సాంకేతిక కారణాల వల్ల ఇలా చేసినట్లు తెలిపింది. తన అధికారిక ట్విట్టర్ పేజీలో పేర్కొంది. గత వారం టెలికాం కనెక్టివిటీ సమస్యల కారణంగా జాతీయ స్టాక్ ఎక్సేంజ్.. ట్రేడింగ్‌కు ఇలానే నాలుగు గంటల పాటు అంతరాయం ఏర్పడింది.
"సాంకేతిక లోపం కారణంగా ఎన్‌ఎస్‌ఈలో క్యాష్ ట్రేడింగ్‌ను నిలిపి వేసాం. బీఎస్ఈలో ఆర్డర్లు యథాతథంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మిగతా అన్ని విభాగాలు చక్కగా పనిచేస్తున్నాయి."
-హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్
ట్రేడింగ్ కార్యకలాపాలపై హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్... జాతీయ స్టాక్ ఎక్సేంజ్‌కు సమాచారం అందించింది. సమస్యను 15 నిమిషాల్లో పరిష్కరించిన సంస్థ ట్రేడింగ్‌ను యథా ప్రకారం తిరిగి ప్రారంభించొచ్చని మరో ట్వీట్ చేసింది.