ETV Bharat / business

రుణ యాప్​లపై కేంద్రం, ఆర్​బీఐకి నోటీసులు - రుణ యాప్​ల నియంత్రణపై కేంద్రానికి నోటీసులు

ఆన్​లైన్ రుణ సంస్థల నియంత్రణ కోసం దాఖలైన పిటిషన్​పై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్రానికి, ఆర్​బీఐకి తాఖీదులు జారీ చేసింది.

HC seeks Centre and RBI stand regulation of online lending platforms
రుణ యాప్​ల నియంత్రణపై సుప్రీం విచారణ
author img

By

Published : Jan 15, 2021, 12:49 PM IST

Updated : Jan 15, 2021, 5:18 PM IST

ఆన్​లైన్​ రుణ సంస్థలను నియంత్రించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై కేంద్రం, భారతీయ రిజర్వు బ్యాంక్​ (ఆర్​బీఐ) అభిప్రాయాలను తెలపాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్​ పటేల్​, జస్టిస్ జ్యోతి సింగ్​తో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

రుణ యాప్​ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా ఆర్​బీఐ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. నియంత్రణ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థలు, క్రమబద్ధీకరించని డిజిటల్ రుణాలపై అధ్యయనం కోసం వర్కింగ్ గ్రూప్​ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మార్గదర్శకాల రూపకల్పనపై ఈ వర్కింగ్‌ గ్రూపు సూచనలు చేయనుంది.

ఇదీ చూడండి:దా'రుణ' యాప్​లపై గూగుల్ వేటు

Last Updated : Jan 15, 2021, 5:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.