కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు తరచూ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో శానిటైజర్ల వాడకం ఎక్కువైంది. ధరలు కూడా పెరిగాయి. అయితే... శానిటైజర్లను మరింత మందికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రముఖ సంస్థ కావిన్‌కేర్.
చిక్, నైల్, రాగా వంటి ప్రముఖ షాంపూలు తయారీ సంస్థ కావిన్‌కేర్ రూపాయి ప్యాకెట్ల తరహాలో శానిటైజర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ సంస్థ 5 లీటర్ల శానిటైజర్ ప్యాక్‌ను విడుదల చేసింది.
"దీన్ని ఓ ఉత్పత్తిలా భావించడం లేదు. మన దేశంలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తి భద్రత కోసం శానిటైజర్లను షాంపూ తరహాలో తీసుకురావాలని నిర్ణయించాం."
-- సి.కె రంగనాథన్, కావిన్‌కేర్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
ఇదీ చదవండి: ఆపరేషన్ నిజాముద్దీన్: వారంతా ఎక్కడికి వెళ్లారు?