ETV Bharat / business

26 కోట్ల మంది ఫేస్​బుక్ డేటా చోరీ- రూ.41వేలకే సేల్

author img

By

Published : Apr 22, 2020, 4:40 PM IST

ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 26.7 కోట్ల మంది ఫేస్​బుక్​ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారు సైబర్ నేరస్థులు. ఈ వివరాలన్నింటినీ కేవలం రూ.41,500కు విక్రయించారు.

Hackers sold data of 267 million Facebook users for just Rs 41,500
ఫేస్​బుక్​ వినియోగదారుల డేటా హ్యాక్​

అంతర్జాలంలో వినియోగదారుల డేటా చోరీ రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా దాదాపు 267 మిలియన్ల ఫేస్​బుక్​ వినియోగదారుల డేటాను దొంగిలించారు సైబర్​ నేరగాళ్లు. వారికి సంబంధించిన ఈమెయిల్​ చిరునామాలు, పేర్లు, ఫేస్​బుక్​ ఐడీఎస్​, పుట్టిన తేదీలు, ఫోన్​ నంబర్లు తస్కరించారు. ఈ సమాచారాన్ని కేవలం రూ.41,500కు విక్రయించారు.

సైబర్​ రిస్క్​ అసెస్​మెంట్​ ప్లాట్​ఫామ్​ సైబుల్​ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ 267 మిలియన్ల వినియోగదారుల పాస్​వర్డ్​లను బహిర్గతం చేయలేదని తెలిపింది.

" ఫేస్​బుక్​ వినియోగదారుల డేటా ఎలా లీక్​ అయిందో మాకు తెలీదు. అప్లికేషన్​ ప్రోగ్రామింగ్​ ఇంటర్ఫేస్​(ఏపీఐ) ద్వారా లీక్ చేసుండవచ్చు."

-- సైబుల్​

గతేడాది డిసెంబరులో 267 మిలియన్లకు పైగా వినియోగదారుల పేర్లు, ఫోన్​ నంబర్లతో కూడిన డేటాబేస్​ ఆన్​లైన్​లో బహిర్గతమైనట్లు పలు వార్తలు వచ్చాయి. ఆన్​లైన్​ హ్యాకర్​ ఫోరమ్​లో డౌన్​లోడ్​ చేసేందుకే డేటాబేస్​ అందులో ఉంచారు.

" ఈ సమస్యను మేం పరిశీలిస్తున్నాం. గత కొన్నేళ్లుగా వినియోగదారుల సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. "

-- ఫేస్​బుక్​

మరింత గోప్యత అవసరం

ఫేస్​బుక్​ ప్రొఫైల్​లలో వినియోగదారుల సమాచారాన్ని మరింత గోప్యంగా ఉంచాలని సూచిస్తున్నారు సైబర్​ నిపుణులు. సెట్టింగ్​లను మరింత కఠినతరం చేయాలని, ఈమెయిల్​, టెక్స్ట్​ మెసేజ్​ల విషయంలో జాగ్రత్త పాటించాలని చెబుతున్నారు.

గతంలో ఎన్నో

గతంలో యూకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్​ సంస్థ కేంబ్రిడ్జ్​ ఎనలిటికా 87 మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించింది. ఇందుకు అప్పట్లో ఫేస్​బుక్​ సంస్థకు ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్​(ఎఫ్​టీసీ) 5 బిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.

పలు యాప్​లు, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల నిర్వహణ, వీడియో స్ట్రీమింగ్ యాప్​లు, బృందాల ద్వారా వక్తుల పేర్లు, ప్రొఫైల్​ ఫొటోలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉందని ఫేస్​బుక్​ గుర్తించింది.

ఇవి కూడా...

ఫేస్​బుక్ ​మాత్రమే కాకుండా ఓకేసారి ఎక్కువ సంఖ్యలో వీడియో కాల్​లు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన జూమ్ ద్వారా కూడా సుమారు 5 లక్షల మందికి పైగా డేటాను హ్యాక్​ చేసినట్లు తెలిపింది సైబుల్. ఈ జూమ్​ యాప్​ ద్వారా ఎక్కువగా కంపెనీలకు చెందిన వ్యక్తులు సమావేశమవుతుంటారు. జూమ్ నుంచి హ్యాక్​ చేసిన సమాచారాన్ని 5 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్ల మధ్య విక్రయిస్తున్నారని తెలిపిందీ సంస్థ.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌లో రోజుకు 4 గంటలు ఆన్‌లైలోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.