నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ రేటును తగ్గిస్తూ ఫిబ్రవరి 24న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని జీఎస్టీ మండలి మంగళవారం అమోదించింది. దీంతో ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 5 శాతంగా ఉన్న జీఎస్టీ రేటు 1 శాతం అయింది.
తగ్గిన జీఎస్టీ రేట్లపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపేందుకు నిర్మాణదారులకు తగిన సమయం ఇస్తామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఎ.బి పాండే ప్రకటించారు. అన్ని కొత్త ప్రాజెక్టులకు ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ తప్పనిసరి అని పాండే తెలిపారు.