ETV Bharat / business

'కొవిడ్​ పరికరాలు, ఔషధాలపై జీఎస్​టీ తగ్గింపు'

జీఎస్​టీ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్​ ఔషధాలు, పరికరాలపై జీఎస్​టీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. అంబులెన్స్‌ సేవలపై 28% నుంచి 12 శాతానికి భారం తగ్గనుంది. టీకాలపై యథాతథంగానే 5 శాతం పన్ను అమల్లో ఉండనుంది.

nirmala seetha raman
నిర్మలా సీతా రామన్​
author img

By

Published : Jun 12, 2021, 3:50 PM IST

Updated : Jun 13, 2021, 9:12 AM IST

కరోనా వైరస్‌, బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు సాంత్వన కలిగించేలా వస్తు,సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వ్యాధుల చికిత్సలో వినియోగించే ఔషధాలు, పరికరాలపై తాత్కాలికంగా పన్ను రద్దు చేస్తూ, మరికొన్నిటిపై ఆ భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. టీకాలపై విధిస్తున్న 5శాతం పన్నులో మార్పులు చేయడానికి తిరస్కరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్‌టీ మండలి 44వ సమావేశం శనివారం వర్చువల్‌ విధానంలో జరిగింది. వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం జీఎస్‌టీ సడలింపునకు సిఫార్సు చేస్తూ సమర్పించిన నివేదికను భేటీ ఆమోదించింది. పన్నుల తగ్గింపు నిర్ణయం ఈ ఏడాది సెప్టెంబరు 30వరకు అమలులో ఉంటుంది. సంబంధిత అధికారిక ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో జారీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ వెల్లడించారు.

టీకాలపై యథాతథం

వ్యాక్సిన్‌లపై విధిస్తున్న 5శాతం జీఎస్‌టీ యథాతథంగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. అయితే, ప్రజలు అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా టీకాలు వేస్తున్నందున వారిపై ఎలాంటి అదనపు భారం పడబోదని తెలిపారు. 75శాతం టీకాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మిగిలిన 25శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు కంపెనీలు విక్రయించుకొనే వెసులుబాటు ఉంది. ఈ టీకాలు వేయించుకునే వారికి మాత్రం 5శాతం జీఎస్‌టీ భారం తప్పదు. టీకా ఉత్పత్తిదారులకు ఇన్‌పుట్‌ పన్ను ప్రయోజనాలు కొనసాగుతాయని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

మంత్రుల బృందంలో సభ్యులు

మే 28న జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో పన్నుల తగ్గింపుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో మేఘాలయ ఉప ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో గుజరాత్‌ ఉపముఖ్యమంత్రి నితిన్‌భాయ్‌ పటేల్‌, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, గోవా రవాణాశాఖ మంత్రి మావిన్‌ గొడినో, ఆర్థిక మంత్రులు టి.హరీశ్‌రావు (తెలంగాణ), కె.ఎన్‌.బాలగోపాల్‌(కేరళ), నిరంజన్‌ పూజారి (ఒడిశా), సురేశ్‌ ఖన్నా (ఉత్తర్‌ప్రదేశ్‌) సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం తమ నివేదికను గత సోమవారం ఆర్థిక శాఖకు సమర్పించింది. దీనిపైనే శనివారం చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

5శాతం పన్ను రద్దు అయినవి

టొసిలిజుమాబ్‌, యాంఫోటెరిసిన్‌ బి ఇంజక్షన్లు.

12%నుంచి 5శాతానికి తగ్గేవి...

రెమ్‌డెసివిర్‌, రక్తంలో గడ్డలను నివారించే హెపరిన్‌ వంటి ఔషధాలు; మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్‌ జనరేటర్లు, వెంటిలేటర్లు, హైఫ్లో నాసల్‌ కాన్యులా(హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ) పరికరాలు, శ్వాస ఇబ్బందులను తొలగించే బైపాప్‌ యంత్రాలు, కొవిడ్‌ పరీక్ష కిట్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు, డి-డైమర్‌, ఐఎల్‌-6 కిట్లు.

18% నుంచి 5శాతానికి తగ్గేవి..
చేతులు శుభ్రం చేసుకొనే శానిటైజర్లు, శరీర ఉష్ణోగ్రత తనిఖీ పరికరాలు, అంత్యక్రియల్లో వినియోగించే గ్యాస్‌/విద్యుత్‌ ఫర్నేస్‌లు.

అంబులెన్స్‌ సేవలకు ప్రస్తుతం విధిస్తున్న 28% పన్ను ఇకపై 12శాతానికి తగ్గనుంది.

ఇదీ చూడండి: నేడు జీఎస్​టీ మండలి భేటీ.. కొవిడ్ పన్నులే అజెండా!

Last Updated : Jun 13, 2021, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.