ETV Bharat / business

'ధరలు అదుపులో ఉంచేందుకే వాటిపై జీఎస్టీ' - నిర్మలా సీతారామన్​

ధరలను అదుపులో ఉంచేందుకే వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లపై పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. టీకాలు, మెడికల్​ ఆక్సిజన్​పై పన్నులను పూర్తిగా రద్దు చేయాలంటూ బంగాల్​ సీఎం మమత రాసిన లేఖపై ఈ మేరకు స్పందించారు.

Nirmala Sitaraman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
author img

By

Published : May 9, 2021, 8:03 PM IST

కరోనా వ్యాక్సిన్లపైనా, మెడికల్‌ ఆక్సిజన్‌పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దు చేయాలంటూ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. వ్యాక్సిన్‌ (5 శాతం పన్ను), ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల (12 శాతం పన్ను) ధరలను అదుపులో ఉంచేందుకే జీఎస్టీ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె వరుస ట్వీట్లు చేశారు.

ఆయా వస్తువులకు ఒకవేళ జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే.. దేశీయ తయారీదారులు ముడిపదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని, తద్వారా వినియోగదారుడిపైనే భారం పడుతుందని సీతారామన్‌ వివరించారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, దాని ముడిపదార్థాలు వంటి ఔషధాలపై దిగుమతి సుంకాలు, ఐజీఎస్టీని తగ్గించినట్లు వివరించారు. సంబంధిత ఔషధాల జాబితాను కూడా ట్వీట్‌ చేశారు. 45+ వయసున్న వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయిస్తోందని, దానికి కేంద్రమే పన్ను చెల్లిస్తోందని తెలిపారు. తద్వారా వసూలైన జీఎస్టీ మొత్తంలో సగం మళ్లీ రాష్ట్రాలకే వెళుతోందని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: పన్ను మాఫీ కోసం మోదీకి దీదీ విన్నపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.