ETV Bharat / business

ఈనెల 28న జీఎస్​టీ మండలి 43వ సమావేశం

జీఎస్​టీ కౌన్సిల్​ 43వ సమావేశం ఈనెల 28న వర్చవల్​గా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ భేటీకి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

GST Council
జీఎస్​టీ మండలి
author img

By

Published : May 15, 2021, 4:10 PM IST

వస్తు, సేవల పన్ను (జీఎస్​టీ) మండలి ఈనెల 28న భేటీ కానుంది. వర్చువల్​గా జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్​ నేతృత్వం వహించనున్నారు.

మే 28న ఉదయం 11 గంటలకు 43వ జీఎస్​టీ కౌన్సిల్​ సమావేశం జరగనుందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

  • Smt @nsitharaman will chair the 43rd GST Council meeting via video conferencing at 11 AM in New Delhi on 28th May 2021. The meeting will be attended by MOS Shri @ianuragthakur besides Finance Ministers of States & UTs and Senior officers from Union Government & States.

    — NSitharamanOffice (@nsitharamanoffc) May 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" దిల్లీలో మే 28న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరగనున్న 43వ జీఎస్​టీ కౌన్సిల్​ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్​ నేతృత్వం వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ హాజరవుతారు. "

- కేంద్ర ఆర్థిక శాఖ

కొవిడ్​ మహమ్మారి నేపథ్యంలో పన్నుల సమస్యలపై తక్షణమే జీఎస్​టీ సమావేశం నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ఇటీవల కోరారు పంజాబ్​ ఆర్థిక మంత్రి మన్​ప్రీత్​ బాదల్​. ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ మేరకు సీతారామన్​కు లేఖ రాశారు.

ఇదీ చూడండి: జీఎస్​టీ మండలి భేటీ తక్షణం జరగాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.