ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: భారీగా పడిపోయిన జీఎస్​టీ వసూళ్లు

author img

By

Published : Aug 1, 2020, 5:33 PM IST

జీఎస్​టీ వసూళ్లు జులై నెలలో భారీ తగ్గుదలను నమోదుచేశాయి. కరోనా సంక్షోభం కారణంగా రూ. 87,422 కోట్లకు పడిపోయాయి. గత నెల పన్నుల వసూళ్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు ఇలా ఉన్నాయి.

GST collections drop to Rs 87,422 cr in July
కరోనా ఎఫెక్ట్​: భారీగా పడిపోయిన జీఎస్​టీ వసూళ్లు

కొవిడ్ విజృంభణతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు జులైలో సుమారు రూ. 3 వేల కోట్లకుపైగా తగ్గాయి. గతనెలలో రూ.90,917 కోట్లుగా ఉన్న వసూళ్లు.. ప్రస్తుతం రూ.87,422కు చేరాయి. లాక్​డౌన్​ కారణంగా మేలో రూ.62,009 కోట్లు, ఏప్రిల్​లో అత్యల్పంగా రూ.32,294 కోట్ల పన్నులు మాత్రమే వసూలయ్యాయి.

జులై జీఎస్​టీ లెక్కలివే..

  • కేంద్ర జీఎస్​టీ - రూ.16,147 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ -రూ.21,418 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ -రూ.42,592 కోట్లు
  • సెస్​- రూ.7,265 కోట్లు

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'ఆపిల్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.