ETV Bharat / business

వరుసగా నాలుగో నెలలో రూ.1.30 లక్షల కోట్లు దాటిన జీఎస్​టీ వసూళ్లు - జీఎస్​టీ వార్తలు

GST Collection in January 2022: ఈ ఏడాది జనవరిలోనూ జీఎస్​టీ వసూళ్ల జోరు కొనసాగింది. వరుసగా నాలుగో నెలలోనూ రూ.1.30 లక్షల కోట్లకుపైనే వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాది జనవరి వసూళ్లతో పోలిస్తే 15 శాతం అధికమని ఆర్థిక శాఖ పేర్కొంది.

GST collection January 2022
జీఎస్​టీ వసూళ్లు
author img

By

Published : Jan 31, 2022, 8:56 PM IST

GST Collection in January 2022: వస్తు, సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు 2022 జనవరిలోనూ 1.30 లక్షల కోట్ల మార్క్​ దాటాయి. జనవరిలో మొత్తం 1.38 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. 2022, జనవరి 30 నాటికి జీఎస్​టీఆర్​-3బీ రిటర్న్​లు దాఖలైంది 1.05 కోట్లుగా పేర్కొంది. దీంతో వరుసగా నాలుగో నెలలోనూ 1.30 లక్షల కోట్ల వసూళ్లు దాటినట్లయింది.

జీఎస్​టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,38,394 కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది. 2021 జనవరితో పోల్చితే ఈ మొత్తం 15 శాతం ఎక్కువని పేర్కొంది.

వసూళ్లు ఇలా..

  • కేంద్ర జీఎస్​టీ: రూ.24,674 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ: రూ.32,016 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ: రూ.72,030 కోట్లు
  • సెస్​: రూ.9,674 కోట్లు

ఇప్పటి వరకు అత్యధికంగా జీఎస్​టీ వసూళ్లు 2021, ఏప్రిల్​లో రూ.1,39,708 కోట్లుగా ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే.. 2022, జనవరిలో వసూలైన జీఎస్​టీ.. 2021, జనవరితో పోలిస్తే 15 శాతం, 2020, జనవరితో పోలిస్తే 25 శాతం అధికమని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకోవడం, జీఎస్​టీ ఎగవేత వ్యతిరేక చర్యలు తీసుకోవడం కారణంగా జీఎస్​టీ వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: GST Collection: వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.