ETV Bharat / business

'జన్​ధన్​ ఖాతాల్లో సొమ్ముపై వదంతులు నమ్మొద్దు'

జన్​ధన్​ ఖాతాలపై ప్రజలు వదంతులు నమ్మొద్దని కోరింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సాయం కింద వేసిన సొమ్మును ప్రభుత్వం వెనక్కి తీసుకోదని స్పష్టంచేసింది. తమకు అనువైన విధంగా ఏ సమయంలోనైనా ఏటీఎం, బ్యాంకుల ద్వారా తీసుకోవాలని సూచించింది.

PMJDY
'జన్​ధన్​ ఖాతాల్లో సొమ్ముపై వదంతులు నమ్మొద్దు'
author img

By

Published : Apr 9, 2020, 4:18 PM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు పీఎం గరీబ్​ కల్యాణ్​ యోజన కింద జన్​ధన్​ ఖాతాల్లో జమచేసే సొమ్ముపై ప్రజలు వందతులు నమ్మొద్దని కేంద్రం సూచించింది. మహిళల జన్​ధన్​ ఖాతాల్లో ఇప్పటికే ఏప్రిల్​కు సంబంధించిన రూ.500లను జమ చేశామని.. మరో రూ.1000 రెండు విడుతల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ప్రభుత్వం వెనక్కి తీసుకోదు..

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ)లోనే అత్యధికంగా జన్​ధన్​ ఖాతాలు ఉన్నాయి. ఇటీవలే కేంద్రం జమ చేసిన రూ.500ను త్వరగా తీసుకోకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందనే వదంతులు వ్యాప్తి చెందాయి. దాంతో లాక్​డౌన్​ ఉన్నా.. బ్యాంకుల వద్ద జనాలు బారులుతీరారు. ఈ నేపథ్యంలో అసత్య వార్తలు నమ్మొద్దని.. ఎవరి ఖాతాలో నుంచి డబ్బును ప్రభుత్వం వెనక్కి తీసుకోదని స్పష్టంచేసింది ఎస్​బీఐ. బ్యాంకు ఆ నగదును బ్లాక్​ చేయటం, ప్రభుత్వానికి తిరిగి పంపించటం చేయబోదని భరోసా కల్పించింది.

ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు..

ఏప్రిల్​ నెలకు సంబంధించిన సొమ్మును ఖాతాల్లో జమ చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్​ఎస్​) ట్వీట్​ చేసింది. ఆ డబ్బును ఏ సమయంలోనైనా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. వదంతులు నమ్మకుండా తమకు అనువైన విధంగా ఏటీఎంలు, కస్టమర్​ సర్వీస్​ పాయింట్లు, బ్యాంకుల ద్వారా ఉపసంహరించుకోవాలని కోరింది.

20 కోట్ల ఖాతాలు మహిళలవే..

దేశవ్యాప్తంగా పీఎంజేడీవై కింద మొత్తం 38.08 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అందులో 20.60 కోట్ల ఖాతాలు మహిళలవే. ఏప్రిల్​ 1 నుంచి ఇప్పటి వరకు రూ.1.19 లక్షల కోట్లు ఆయా ఖాతాల్లో జమచేసింది కేంద్రం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.