ETV Bharat / business

బ్యాంకుల ప్రైవేటీకరణకు రెండు చట్టాల్లో సవరణలు - బడ్జెట్​ 2021లో బ్యాంకుల ప్రైవేటీకరణ వార్తలు

బడ్జెట్​లో ప్రకటించినట్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు.. కేంద్రం అవసరమైన చట్ట సవరణలు చేయనుంది. రెండు చట్టాలకు సంబంధించిన సవరణలకు వర్షాకాల సమావేశాల్లో గానీ, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆమోదం లభించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

amendments to two Acts to enable privatisation of PSU banks
బ్యాంకుల ప్రైవేటీకరణకు చట్టాల్లో సవరణ
author img

By

Published : Feb 17, 2021, 9:59 AM IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వీలుకల్పించేలా ఈ ఏడాది ద్వితీయార్ధంలో రెండు చట్టాల్లో ప్రభుత్వం సవరణలు చేయనుంది. బ్యాంకింగ్ కంపెనీస్​ (అక్విజిషన్​ అండ్ ట్రాన్స్​ఫర్​ ఆఫ్​ అండర్​టేకింగ్స్​) యాక్ట్​-1970, 1980 చట్టాల్లో సవరణలు చేస్తేనే ప్రభుత్వరంగ బ్యాంకులుగా ప్రైవేటీకరణకు వీలవుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ చట్టాల వల్లే రెండు దశల్లో బ్యాంకులు జాతీయీకరణ జరిగింది. ఇప్పుడు మళ్లీ బ్యాంకులను ప్రైవేటీకరించాలంటే ఈ చట్టాల్లో మార్పులు చేపట్టాల్సి ఉంటుంది అంటున్నారు.

ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ సమావేశాల్లో రెండు బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, వర్షాకాల సమావేశాలు లేదా ఈ ఏడాది ద్వితీయార్ధంలో సంబంధిత చట్టాల్లో సవరణలు చోటుచేసుకోవచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్​ సమావేశాల్లో ఆర్థిక బిల్లు-2021తో పాటు 38 బిల్లులపై చర్చించనున్నారు. అందులో క్రిప్టో కరెన్సీ బిల్​-2021 కూడా ఉంది. గతేడాది 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా మార్చడం వల్ల మార్చి 2017లో 27గా ఉన్న మొత్తం పీఎస్​బీల సంఖ్య 12కు పరిమితమైంది.

ఇదీ చదవండి:త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.