బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది కేంద్రం. ఇప్పటివరకు 49 శాతానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తుండగా.. తాజా బడ్జెట్లో ఈ పరిమితిని 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇందుకు సంబంధించి విదేశీ సంస్థలకు యాజమాన్య వాటా దక్కేలా 1938 ఇన్సూరెన్స్ చట్టానికి మార్పులు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇన్వెస్టర్ ఛార్టర్ను సైతం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
"1938 బీమా చట్టాన్ని సవరించాలని ప్రతిపాదిస్తున్నా. దీని ప్రకారం బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెరుగుతుంది. ఈ సంస్థలను నియంత్రించే అధికారం విదేశీ యాజమాన్యానికి లభిస్తుంది."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి