ETV Bharat / business

రేషన్​ దుకాణాల ద్వారా వంట గ్యాస్ సిలిండర్ల విక్రయం! - రేషన్ షాపుల్లో గ్యాస్ అమ్మకం

దేశంలోని రేషన్ దుకాణాల ద్వారా చిన్న వంట గ్యాస్ సిలిండర్లు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. చౌక ధరల దుకాణాలకు ఆర్థిక స్థిరత్వం చేకూర్చే ప్రణాళికల్లో భాగంగా ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

cylinders
రేషన్​ షాపు
author img

By

Published : Oct 27, 2021, 8:31 PM IST

రేషన్ దుకాణాల ద్వారా చిన్న వంట గ్యాస్ సిలిండర్లను విక్రయించేందుకు అనుమతి ఇచ్చే ప్రణాళికల్లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. తద్వారా చౌక ధరల దుకాణాలకు మరింత ఆర్థిక స్థిరత్వం చేకూరుతుందని పేర్కొంది. ఈమేరకు కేంద్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సుధాంన్షు పాండే రాష్ట్రాలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఆర్థిక, పెట్రోలియం శాఖల ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇండియన్ ఆయిల్, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం సంస్థల అధికారులు కూడా చర్చకు హాజరయ్యారు.

రేషన్‌ దుకాణాల ద్వారా చిన్న వంట గ్యాస్ సిలిండర్లు విక్రయించేందుకు అనుమతిచ్చే ఆలోచన ఉందని సమావేశం తర్వాత కేంద్రం తెలిపింది. ఇందుకు చమురు పంపిణీ సంస్థలు కూడా సహకరిస్తామని చెప్పినట్లు వివరించింది. ఈ విషయంలో ఆసక్తి చూపే రాష్ట్రాల్లోని రేషన్ దుకాణాలకు.. అవసరమైన మద్దతిస్తామని ఆర్థిక సేవల విభాగం వెల్లడించింది.

చౌక ధరల దుకాణదారులకు ముద్రా రుణాలను విస్తరించే ప్రణాళిక ఉందని తెలిపింది. ఈ అవకాశాన్ని అందుకోవాలని..రాష్ట్రాలను కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.