లాక్‌డౌన్ వేళ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు ఆదాయ పన్ను, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల సడలింపునకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించారు. తాజా ఆర్డినెన్స్‌తో 2018-19 ఏడాదికి ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు మరో మూడు నెలలు(జూన్ 30) వరకు పొడిగించడంతో పాటు పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు లభించనుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం ఎల్ఐసీ, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, 80 డీ మెడిక్లైమ్, 80 జీ విరాళాలు కింద పన్ను మినహాయింపును జూన్ 30 లోగా క్లెయిమ్ చేసుకోవచ్చు.