ఫాస్పేటిక్, పొటాషిక్ ఫర్టిలైజర్లు అంతర్జాతీయ మార్కెట్ నుంచి సరసమైన ధరలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై దౌత్య మార్గాల ద్వారా ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ఫర్టిలైజర్ పరిశ్రమ వర్గాలకు హామీ ఇచ్చింది.
2021 ఖరీఫ్ సీజన్‌కు ముందు ఎరువుల లభ్యతపై ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ నేతృత్వంలో ఏప్రిల్ 12న సమీక్ష సమావేశం జరిగింది. దేశంలో విరివిగా ఉపయోగించే డీఅమ్మోనియం ఫాస్పేట్ వంటి ఎరువుల ధరలను పెంచొద్దని పలు కంపెనీలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరాయి. అంతర్జాతీయంగా ముడి సరకుల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్‌కు అన్ని ప్రాంతాల్లో ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా ప్రకటన విడుదల చేసింది. దిగుమతి చేసుకునే ఎరువుల ధరలపై ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. రైతులకు సరైన సమయంలో, సరైన ధరకు ఎరువులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఎరువుల ధరాఘాతం.. రైతులపై పిడుగు