ఐర్‌సీటీసీలో 20 శాతం వాటా విక్రయానికి కేంద్రం సన్నద్ధమైంది. 15 శాతం(2.40 కోట్ల షేర్లు) వాటాను ఆఫర్ ఆఫ్ సేల్ విధానం(ఓఎఫ్ఎస్)లో అమ్మాలని ప్రతిపాదించింది. ఓవర్ సబ్‌స్క్రైబ్ అయితే మరో 5 శాతం(80లక్షల షేర్లు) వాటాను విక్రయించాలని నిర్ణయించింది.
ప్రాథమిక ధరను ఓక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1,367 ఖరారు చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రత్యేక విండో ద్వారా ఈ నెల 10, 11న అమ్మకపు ప్రక్రియ నిర్వహించనున్నారు. అయితే.. డిసెంబర్ 11న జరిగే బిడ్డింగ్‌లో రిటైల్ పెట్టుబడిదారులకే అనుమతి ఉంటుంది.
ఇదీ చదవండి: ఏంటీ బిట్‌కాయిన్? భారత్‌లో పెట్టుబడి పెట్టొచ్చా?