43 మొబైల్ యాప్స్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు ఇవి భంగం కలిగిస్తున్నాయని పేర్కొంది.
ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. తాజా జాబితాలో ఆలీబాబా వర్క్‌బెంచ్, కామ్కార్డ్లు ఉన్నాయి.
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య ఇప్పటికే 177 యాప్స్‌ను భారత్ నిషేధించింది. ఈ జాబితాలో పబ్జీతో పాటు మరికొన్ని ప్రముఖ యాప్స్ ఉన్నాయి.