కొవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'కాంగ్రెస్ టూల్‌కిట్' వ్యవహారంలో ప్రముఖ సోషల్‌మీడియా ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ టూల్‌కిట్‌గా చెబుతూ చేసిన ట్వీట్లను 'మ్యానిపులేటెడ్ మీడియా'గా పేర్కొనడంపై మండిపడ్డ కేంద్రం.. ఆ పదాన్ని వెంటనే తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దేశంలో కొవిడ్ పరిస్థితులపై కాంగ్రెస్ ప్రత్యేక టూల్‌కిట్ రూపొందించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని భాజపా ఆరోపణలు చేస్తోంది. ఇటీవల ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా కాంగ్రెస్ టూల్‌కిట్‌గా పేర్కొంటూ ట్వీట్ చేశారు. భాజపాకు చెందిన నేతలు కూడా దీన్ని రీట్వీట్ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ట్వీట్లను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టూల్‌కిట్ అని ఉన్న ట్వీట్ల కింద 'మ్యానిపులేటెడ్ మీడియా' అని ట్విట్టర్ నిన్న సాయంత్రం మార్క్ చేసింది.
ఈ విషయంపై స్పందించిన కేంద్రం.. ఆ పదాన్ని వెంటనే తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
'ఈ వ్యవహారంపై విచారణ పెండింగ్‌లో ఉంది. సదరు సమాచారం నిజమా? కాదా? అన్నది చెప్పాల్సింది దర్యాప్తు సంస్థ. ట్విట్టర్ కాదు. దర్యాప్తు ప్రక్రియలో ట్విట్ఠర్ జోక్యం చేసుకోకూడదు. ఈ అంశంపై విచారణ జరుగుతుండగానే ట్విట్టర్ తీర్పు చెప్పకూడదు'అని కేంద్రం హెచ్చరించినట్లు సదరు వర్గాల సమాచారం. ఆ పదాన్ని తొలగించాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది.
టూల్‌కిట్ వివాదం ఏమిటి?
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కార్యకర్తలు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ ఉన్న పత్రాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి.
కాంగ్రెస్ గుర్తుతో ఉన్న ఆ పత్రాలను భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సహా పలువురు కమలదళ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా కొత్త రకం మ్యుటెంట్‌ను 'ఇండియన్ స్ట్రెయిన్' లేదా 'మోదీ స్ట్రెయిన్' అని పిలవాలని ఆ పత్రాల్లో ఉన్నట్లు భాజపా పేర్కొంది. 'రాజకీయ లబ్ధి కోసం విదేశీ పాత్రికేయుల సాయంతో దేశ ప్రతిష్ఠను మంటగలపడానికి కాంగ్రెస్ ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదు. ఒక వ్యూహం ప్రకారమే కుంభమేళాను సూపర్ స్ప్రెడర్ కుంభ్‌గా పిలవాలని ఆ పార్టీ తన సామాజిక మాధ్యమ వాలంటీర్లకు పిలుపు నిచ్చింది' అంటూ సంబిత్ పాత్రా ట్వీట్ చేశారు.
భాజపా అధ్యక్షుడు నడ్డా ట్వీట్ చేస్తూ..'సమాజాన్ని విభజించడం, ఇతరులపై విషం వెళ్లగక్కడం వంటి కళల్లో కాంగ్రెస్ పార్టీ ఆరితేరింది' అని ఆరోపించారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
-
Friends look at the #CongressToolKit in extending help to the needy during the Pandemic!
— Sambit Patra (@sambitswaraj) May 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
More of a PR exercise with the help of “Friendly Journalists” & “Influencers” than a soulful endeavour.
Read for yourselves the agenda of the Congress:#CongressToolKitExposed pic.twitter.com/3b7c2GN0re
">Friends look at the #CongressToolKit in extending help to the needy during the Pandemic!
— Sambit Patra (@sambitswaraj) May 18, 2021
More of a PR exercise with the help of “Friendly Journalists” & “Influencers” than a soulful endeavour.
Read for yourselves the agenda of the Congress:#CongressToolKitExposed pic.twitter.com/3b7c2GN0reFriends look at the #CongressToolKit in extending help to the needy during the Pandemic!
— Sambit Patra (@sambitswaraj) May 18, 2021
More of a PR exercise with the help of “Friendly Journalists” & “Influencers” than a soulful endeavour.
Read for yourselves the agenda of the Congress:#CongressToolKitExposed pic.twitter.com/3b7c2GN0re
ఇవీ చదవండి: