ETV Bharat / business

బండి పొల్యూషన్​ సర్టిఫికేట్​ ఇక ఇలా ఉండాల్సిందే... - వాహనాలకు పీయూసీ సర్టిఫికేట్

ఇకపై దేశంలోని అన్ని వాహనాలకు ఒకే విధమైన కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్​ను జారీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్తగా 'తిరస్కరణ పత్రం' అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. అధికారుల ఆదేశాల ప్రకారం కాలుష్య నియంత్రణ పరీక్షలు చేయకపోతే.. వాహన రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశం ఉంది.

VEHICLES POLLUTION CERTIFICATE
వాహనాలన్నింటికీ ఒకే తరహా కాలుష్య సర్టిఫికేట్
author img

By

Published : Jun 17, 2021, 4:33 PM IST

దేశవ్యాప్తంగా ఇకపై అన్ని వాహనాలకు ఒకే రకమైన కాలుష్య నియంత్రణ(పీయూసీ) ధ్రువీకరణ(PUC certificate) పత్రాన్ని జారీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సర్టిఫికేట్​పై క్యూఆర్​ కోడ్(QR code)​ను ప్రింట్ చేయనున్నట్లు తెలిపింది. పీయూసీ డేటాబేస్(PUC database)​ను నేషనల్ రిజిస్టర్​(National Register)కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. 1989 మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులకు అనుగుణంగా.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పీయూసీ సర్టిఫికేట్​పై ఉండే క్యూఆర్​ కోడ్​లో.. వాహనంతో పాటు యజమాని వివరాలు, కాలుష్య ఉద్గార స్థాయి వంటి సమాచారం ఉంటుందని వివరించింది. వీటితో పాటు యజమాని మొబైల్ నంబర్​ను ఇందులో తప్పనిసరి చేసింది. వాహనం ధ్రువీకరణ కోసం ఈ నంబర్​కు ఎస్ఎంఎస్ అలర్ట్​లు వస్తాయని తెలిపింది.

తొలిసారి 'తిరస్కరణ పత్రం'(rejection slip) అనే విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది. అనుమతించే స్థాయి కన్నా అధిక ఉద్గారాలు వెలువడుతున్నట్లు పరీక్షల్లో తేలితే.. ఈ స్లిప్​ను యజమానికి ఇవ్వనున్నట్లు తెలిపింది.

అలా చేయకపోతే జరిమానా...

ఏదైనా వాహనం కాలుష్య ప్రమాణాలకు లోబడి లేదని ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు భావిస్తే.. ఆ వాహనాన్ని పీయూసీ టెస్టింగ్ సెంటర్​కు తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని అధికారులు యజమానికి.. నేరుగా లేదా ఆన్​లైన్ మాధ్యమం ద్వారా సమాచారం అందించవచ్చని పేర్కొంది. ఒకవేళ అధికారుల ఆదేశాలను విస్మరిస్తే.. వాహన యజమాని జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

నూతన నిబంధనలను పాటించకపోతే వాహన రిజిస్ట్రేషన్ సహా పర్మిట్​ను రద్దు చేసే అధికారం రిజిస్టరింగ్ అథారిటీకి ఉంటుందని వివరించింది.

ఇవీ చదవండి:

షూ లేకుండా బైక్​ నడిపితే ఫైన్​-​ మీకు తెలుసా?

తిరిగిన కిలోమీటర్ల మేరకే బీమా ప్రీమియం చెల్లింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.