ETV Bharat / business

ఎయిర్​ ఇండియా విక్రయం అధికారికం-టాటాలకు ఎల్​ఓఐ జారీ - టాటా సన్స్​ వాటా టాటా

ఎయిర్​ ఇండియా అధికారిక విక్రయంలో మరో ముందడుగు పడింది. 100 శాతం పెట్టుబడిని ధ్రువీకరిస్తూ ప్రభుత్వం టాటా గ్రూప్​కు లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ను జారీ చేసింది.

Air India
ఎయిర్​ ఇండియా
author img

By

Published : Oct 12, 2021, 4:34 AM IST

Updated : Oct 12, 2021, 5:17 AM IST

ఎయిర్​ ఇండియాలో 100 శాతం విక్రయాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం టాటా గ్రూప్స్​కు (Tata Airlines News ) లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​(ఎల్​ఓఐ)ను జారీ చేసింది. గతవారం టాటాలకు చెందిన టాలెస్​ దాఖలు చేసిన రూ. 2,700 కోట్ల నగదు, రూ. 15,300 రుణ టేకోవర్​ ఆఫర్​ (మొత్తం రూ.18వేల కోట్లు)కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. సోమవారం ఎల్​ఓఐ జారీ చేసినట్లు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్​) కార్యదర్శి తుహిన్​ కాంత పాండే పేర్కొన్నారు.

  • ఎల్​ఓఐని టాటాలు అంగీకరించాక షేర్​ పర్చేజ్​ ఆగ్రిమెంట్​ (ఎస్​పీఏ)పై 14 రోజుల్లోగా సంతకాలు జరుగుతాయి. కార్యకలాపాలను టేకోవర్​ చేయడానికి ముందు కొన్ని షరతులను టాటాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఒప్పందం విలువ(ఈవీ)లో 1.5 శాతం (రూ. 270 కోట్లు) మేర బ్యాంక్​ హామీని టాటాలు సమర్పించాలి. ఒప్పందం ఉన్న నగదు విషయం డిశంబరు చివర్లో తెరపైకి వస్తుంది.

కొన్ని నెలల్లో పూర్తి చేస్తాం..

ఎయిర్ ఇండియా కొనుగోలు ప్రక్రియను కొన్ని నెలల్లో పూర్తి చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని టాటా సన్స్​ సోమవారం తెలిపింది. మంగళవారం టాటా సన్స్​బోర్డ్​ సమావేశం కానుంది.

ఇదీ చూడండి: టాటాకు అప్పగించే ముందే ఎయిర్​ ఇండియా అప్పుల బదిలీ

Last Updated : Oct 12, 2021, 5:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.