ETV Bharat / business

ప్యాకేజ్డ్‌ వస్తువులకు యూనిట్‌ విక్రయ ధర - యూనిట్ సేల్స్ ధర

ప్యాకేజ్డ్‌ ఉత్పత్తులపై యూనిట్‌కు ఎంత ధర(Unit Sales Price) ఉంటుంది? అనే విషయాన్ని వినియోగదారులు తెలుసుకునేందుకు వీలుగా.. లీగల్‌ మెట్రాలజీ(ప్యాకేజ్డ్‌ వస్తువులు) నిబంధనలు-2011ను కేంద్రం సవరించింది. దీంతో కిలో కంటే ఎక్కువ బరువు ఉన్న ప్యాకేజ్డ్‌ వస్తువులపై గరిష్ఠ చిల్లర ధరతో (ఎమ్‌ఆర్‌పీ) పాటు యూనిట్‌ విక్రయ ధర కూడా ఉత్పత్తి సంస్థలు ముద్రించాల్సి ఉంటుంది.

Unit Sales Price
యూనిట్‌ విక్రయ ధర
author img

By

Published : Nov 9, 2021, 9:33 AM IST

బిస్కెట్‌ ప్యాకెట్లు, సబ్బులు, పేస్టుల బరువు 88 గ్రాములు, 166 గ్రా., 177 గ్రా.. ఇలా ఉండి, గరిష్ఠ విక్రయ ధర మాత్రమే ముద్రిస్తున్నారు. ఇతర కంపెనీకి చెందిన అదేరకం ఉత్పత్తి ధరతో పోల్చడానికి వీల్లేకపోతోంది. యూనిట్‌కు ఎంత ధర అని దానిపై ముద్రించకపోవడమే ఇందుకు కారణం. ప్యాకేజ్డ్‌ ఉత్పత్తులకు యూనిట్‌ విక్రయ ధర(Unit Sales Price) ఎంతో తెలపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం లీగల్‌ మెట్రాలజీ(ప్యాకేజ్డ్‌ వస్తువులు) నిబంధనలు-2011ను సవరించింది. కిలో కంటే ఎక్కువ బరువు ఉన్న ప్యాకేజ్డ్‌ వస్తువులపై గరిష్ఠ చిల్లర ధర (ఎమ్‌ఆర్‌పీ)తో పాటు యూనిట్‌ విక్రయ ధర(Unit Sales Price) కూడా ముద్రిస్తారు. ఉదాహరణకు 2.5 కిలోల గోధుమ బిండి ప్యాకెట్‌పై ఎమ్‌ఆర్‌పీతో పాటు కిలో ధర కూడా ఉంటుంది. కిలో లోపల బరువున్న వాటిపై గ్రాము ధర కూడా ముద్రించాల్సి ఉంటుంది.

కంపెనీలకూ నిబంధనల సడలింపు

"షెడ్యుల్‌ 2లోని నిబంధనల ప్రకారం..19 రకాల వస్తువులను నిర్దిష్ట బరువులోనే ప్యాక్‌ చేయాలి.బియ్యం లేదా గోధుమ పిండిని 100గ్రా, 200 గ్రా, 500 గ్రా, 1 కిలో, 1.25 కిలో, 1.5 కిలో, 1.75 కిలో, 2 కిలోలు, 5 కిలోలు ఆ తర్వాత 5 గుణింతాల్లో ప్యాక్‌ చేయాల్సి ఉంటుంది. వివిధ పరిమాణాల్లో వీటిని విక్రయించేందుకు అనుమతించాలని పరిశ్రమ గతంలోనే కోరగా.. కొన్నిటికి అనుమతులు వచ్చాయి. కొన్నిటికి రాలేదు. కంపెనీల సౌలభ్యం కోసం తాజాగా షెడ్యూల్‌ 2లోని నిబంధనలను రద్దు చేసి, యూనిట్‌ విక్రయ ధర(Unit Sales Price) అంశాన్ని తీసుకొచ్చామ"ని ఓ అధికారి వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్​ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు.

ఈ మూడు నిబంధనల్లోనూ మార్పు

  • ఎమ్‌ఆర్‌పీని కంపెనీలు తమకిష్టమైన రూపంలో ముద్రించుకోవచ్చు.
  • కంపెనీలు ప్యాకేజ్‌లో ఉన్న వస్తువుల సంఖ్యను ఇప్పటిదాకా నిర్దిష్ట రూపంలోనే(శ్రీశ్రీఎన్‌ లేదా శ్రీశ్రీయూ) ముద్రించాల్సి వస్తోంది. దీనినీ రద్దు చేశారు.
  • దిగుమతి లేదా తయారీ లేదా ప్రీప్యాకేజింగ్‌ తేదీల్లో ఏది ముద్రించుకోవాలి అనే అంశాన్ని ఇప్పటిదాకా కంపెనీలకే వదిలిపెట్టారు. ఇకపై తయారీ తేదీని మాత్రమే ముద్రించాలి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.