2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి సంబంధించి రబీ పంటకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) ఖరారు చేసింది కేంద్రం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
- గోధుమ క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.2015కు పెంచింది. ప్రస్తుతం ఇది రూ.1975గా ఉంది.
- బార్లీ క్లింటా ప్రస్తుతం ఎంఎస్పీ రూ.1600 ఉండగా.. 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి గానూ రూ.1635కి పెంచింది.
- పొద్దుతిరుగుడు క్వింటా కనీస మద్దతు ధరను రూ.5,327 నుంచి రూ.5,441కు పెరిగింది.
- ఎర్ర కంది (మసూర్) కనీస మద్దతు ధర రూ.400 పెంచింది. దీనితో క్వింటా ధర రూ.5,100 నుంచి రూ.5,500కు పెరిగింది.
- అవాలు కనీస మద్దతు ధరను కూడా 400 పెంచింది. దీనితో క్వింటా ఆవాలు ధర రూ.5050కి చేరింది. ఇందుకు ముందు ఇది రూ.4,650గా ఉండేది.
- కాయ ధాన్యాల (కందులు, పెసళ్ల వంటివి).. కనీస మద్దతు ధరను కూడా రూ.5,100 నుంచి రూ.5,230కి పెంచింది.
కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..
రబీ కనీస మద్దతు ధర పెంపు సహా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. జౌళి పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రూ.10,683 ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది.
ముఖ్యంగా చేనేత వస్త్రాలు, సాంకేతికంగా రూపొందించే వస్త్ర పరిశ్రమలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకురనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: 'వజ్రాభరణాలనూ అద్దెకు తీసుకోవచ్చు'