ETV Bharat / business

ఎయిర్​ఇండియా: సందేహాలు తెలిపేందుకు గడువు పెంపు - ఎయిర్​ఇండియా

ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణలో ఆసక్తిగల బిడ్డర్లు సందేహాలు వెలిబుచ్చడానికి ఇచ్చిన గడువును పెంచింది ప్రభుత్వం. తొలుత ఫిబ్రవరి 11న అందివ్వాలని ఆదేశాలు ఇచ్చినా.. మార్చి 6వరకు పొడిగిస్తూ నేడు నిర్ణయం తీసుకుంది.

airindia
ఎయిర్​ఇండియా
author img

By

Published : Feb 24, 2020, 7:57 PM IST

Updated : Mar 2, 2020, 10:53 AM IST

ఎయిర్​ఇండియా అమ్మకానికి సంబంధించి సందేహాలను వెలిబుచ్చడానికి బిడ్డర్లకు మార్చి 6 వరకు గడువు పెంచింది కేంద్రం. తొలుత సందేహాలను రాతపూర్వకంగా తెలిపేందుకు తుది గడువుగా ఫిబ్రవరి 11ను నిర్ణయించింది.

ఎయిర్​ఇండియాను 100 శాతం ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఆసక్తి ఉన్న బిడ్డర్లు సందేహాలను తెలుపవచ్చని జనవరి 27న స్పష్టంచేసింది.

ప్రాథమిక సమాచార మెమోరాండం(పీఐఎం), షేర్​ పర్చేస్​ అగ్రీమెంట్​పై సందేహాలకు ఫిబ్రవరి 11, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖకు సంబంధించి ఫిబ్రవరి 21 తుది గడువుగా నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియలకు మార్చి 6వరకు పొడిగించింది.

Last Updated : Mar 2, 2020, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.