ETV Bharat / business

వాట్సాప్ కొత్త రూల్స్​పై కేంద్రం నజర్

author img

By

Published : Jan 14, 2021, 2:06 PM IST

Updated : Jan 14, 2021, 2:35 PM IST

వాట్సాప్​ నూతన గోప్యతా విధానంపై కేంద్రం దృష్టిసారించింది. ఇటీవల తీసుకొచ్చిన గోప్యతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించనున్నట్లు తెలిపింది.

Govt examining WhatsApp's user policy changes amid privacy debate
వాట్సాప్​ వినియోగదారుల గోప్యతపై కేంద్రం కీలక నిర్ణయం

వాట్సాప్‌ నూతన గోప్యతా విధానంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల సమాచారాన్ని మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని వాట్సాప్‌ ప్రకటించిన నేపథ్యంలో గోప్యతను ప్రమాణాలను పరిశీలించనుంది. ఈ మేరకు ఫేస్​బుక్​ యాజమాన్యంతో సంస్థ కొత్తగా తీసుకుని వచ్చిన మార్పులపై కేంద్ర సమాచార,మంత్రిత్వ శాఖ అంతర్గత చర్చలు జరపనుంది.

ప్రస్తుతం వాట్సాప్ తీసుకువచ్చిన గోప్యతా విధానం ఎంతవరకు సరైనదనే దానిపై ప్రధానంగా చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫేస్​బుక్​తో సమాచారాన్ని ఎలా పంచుకుంటారు? అందుకు తగిన నియమ, నిబంధనలపై కూడా వివరణ కోరనుంది. వాట్సాప్‌ యూజర్ల డేటా ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలతో పంచుకోవడంపై స్పష్టత కోరనుంది.

దిగ్గజ వ్యాపారవేత్తలు సహా పెద్ద సంఖ్యలో వినియోగదారుల వాట్సాప్​ తీసుకు వచ్చిన కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్త చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

మన దేశంలో వాట్సాప్​ వినియోగదారులు సంఖ్య సుమారు 40 కోట్ల వినియోగదారులను కలిగి ప్రపంచంలోనై అతిపెద్ద మార్కెట్లో ఒకటిగా ఉంది.

ఇవీ చూడండి:

వాట్సాప్‌ నూతన విధానం- గోప్యతా హక్కుకు తూట్లు

ఫేస్​బుక్​తో డేటా షేరింగ్​పై వాట్సాప్​ స్పష్టత

డేటా షేరింగ్‌పై 'వాట్సాప్‌' వివరణ

Last Updated : Jan 14, 2021, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.